న్యాయవాది హత్య కేసులో
సంతోష్‌నగర్: న్యాయవాదిని హత్య చేసిన కేసులో నిందితుడిని ఐఎస్ సదన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. చంపాపేట్ ఈస్ట్ మారుతీనగర్‌కు చెందిన ఎర్రబాపు ఇజ్రాయిల్ (56)కు సంతోష్‌నగర్‌లోని శ్రీనివాస అపార్ట్‌మెంట్‌లో గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లాట్ ఉంది. ఇజ్రాయిల్ శ్రీనివాస అపార్ట్‌మెంట్‌లో ఎలాంటి ఎలక్ట్రికల్ పని ఉన్నా తూర్పు మారుతీనగర్ శ్మశాన వాటిక గదిలో ఉండే గులాం దస్తగిరీ (49)ని పిలిపించి చేయించేవాడు. కాగా.. శ్రీనివాస అపార్ట్‌మెంట్‌లో ఓ వ్యక్తి, ఆయన భార్య వాచ్‌మెన్‌లుగా పని చేస్తున్నారు. దీంతో దస్తగిరీ అపార్ట్‌మెంట్‌కు రాకపోకలు సాగిస్తున్న సమయంలో సదరు మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకున్న న్యాయవాది ఇజ్రాయిల్ వాచ్‌మెన్ దంపతులను వారి స్వగ్రామానికి పంపించాడు. అనంతరం దస్తగిరీ తరచూ న్యాయవాది ఇజ్రాయిల్ వద్దకు వచ్చి వాచ్‌మెన్‌ను హత్య చేస్తే తనకు బెయిల్ ఇప్పించాలని కోరేవాడు. దంపతులను తిరిగి పిలిపించి తమను కలపాలని దస్తగిరీ సూచించగా.. దానికి న్యాయవాది ఇజ్రాయిల్ నిరాకరించారు. దీంతో ఇజ్రాయిల్‌పై కక్ష పెంచుకున్న దస్తగిరీ ఆయన కదలికలను కొన్ని రోజులుగా గమనించడం ప్రారంభించాడు. ఇందులో భాగంగా ఈ నెల 24 ఉదయం 8.50 గంటల సమయంలో న్యాయవాది ఇజ్రాయిల్ మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లి తిరిగి తన యాక్టివాపై తిరిగి ఇంటి వస్తున్నాడు. న్యూ మారుతీనగర్ కాలనీలో కాపు కాసి వేచి ఉన్న దస్తగిరీ.. ఇజ్రాయిల్‌పై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో తీవ్ర గాయాలకు గురైన ఇజ్రాయిల్‌ను స్థానికులు, కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారుడ. దీనిపై న్యాయవాది ఇజ్రాయిల్ కూతురు ద్రాక్షవల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం నిందితుడు గులాం దస్తగిరీని అరెస్ట్ చేసి, అతని నుంచి కత్తి, సెల్‌ఫోన్, హోండా యాక్టివా ద్విచక్ర వాహనం, హెల్మెట్, కంటి అద్దాలు, చెప్పులను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.