10 Seconds Video Clip Sold For Rs 48 Crores: Know The Interesting Fact - Sakshi
Sakshi News home page

కోట్లు కురిపించిన 10 సెకన్ల వీడియో

Published Tue, Mar 2 2021 3:47 PM | Last Updated on Tue, Mar 2 2021 8:06 PM

10 Seconds Video Clip Sold For 48 Crores: Know The Interesting Fact - Sakshi

వాషింగ్టన్‌: పాటలకు, యానిమేషన్స్‌కు, ఇంకా ఇతరత్రా వీడియోలు చాలా వాటికి హక్కులు ఉంటాయి. ఇందులో కొన్నింటిని ఆసక్తి ఉన్న ఎవరైనా కొనుక్కోవచ్చు. మరికొన్నింటిని మాత్రం కొనుక్కునేందుకు సిద్ధంగా ఉన్నా అమ్మడానికి మాత్రం మేకర్స్‌ పెద్దగా ఇంట్రస్ట్‌ చూపరు. ఇదిలా ఉంటే తాజాగా ఓ పది సెకన్ల వీడియో క్లిప్పింగ్‌ రూ.48.4 కోట్లకు అమ్ముడుపోయింది. ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. ఇంతకీ అందులో అంత స్పెషలేముందంటారా? అదేంటో తెలియాలంటే ఇది చదివేయాల్సిందే..

అమెరికాకు చెందిన ఆర్ట్‌ కలెక్టర్‌ పబ్లో రోడ్రిగ్యూజ్‌ ఫ్రైల్‌ గతేడాది ఓ వీడియోను రూపొందించాడు. పది సెకన్ల నిడివి మాత్రమే ఉన్న దీనికోసం అతడు 67 వేల డాలర్లు ఖర్చు పెట్టాడు. భారత కరెన్సీలో చెప్పాలంటే అక్షరాలా రూ.49.23 లక్షలు వెచ్చించాడు. అయితే అనూహ్యంగా గతవారం ఈ వీడియో 6.6 మిలియన్‌ డాలర్లకు అంటే 48.47 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఈ వీడియోలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నేలపై చొక్కా లేకుండా పడుకున్నట్లుగా ఉండగా అతడి శరీరంపై రకరకాల నినాదాలు రాసి ఉన్నాయి. జనాలు అతడిని ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోతున్నారు.

10 సెకన్ల వీడియో క్లిప్పింగ్‌ అమ్మకాన్ని ధృవీకరిస్తూ రీయూటర్స్‌ ఓ వీడియో రిలీజ్‌ చేసింది. బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీలో ఇదో కొత్త రకం నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్‌(ఎన్‌ఎఫ్‌టీ) అని పేర్కొంది. ఆన్‌లైన్లో ఇన్వెస్టర్లు ఎటువంటి భయాలు లేకుండా పెట్టుబడి పెట్టేందుకు ఇది ఉపయోగపడుతుందని స్పష్టం చేసింది. కాగా మోసాలకు కళ్లెం వేసేందుకు ఈ బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీని వాడుతారు. ఇది పారదర్శకతను అందరికీ అందుబాటులోకి తెస్తుంది. ఈ టెక్నాలజీలో సమాచారం అందరివద్దా ఉండటమే కాక ఎవరు ఏం చేయాలన్నా నిమిషాల్లో అందరికీ తెలిసిపోతుంది. దీంతో ఫ్రాడ్‌ జరిగే అవకాశమే లేదన్నమాట!

చదవండి: వైరల్‌: మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌కు 5 లీటర్ల పెట్రోల్‌!

సూపర్‌: ఇలా కూడా అ‍డ్రస్‌ చెప్పొచ్చా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement