లండన్: భారత్ దెబ్బకు యూకే అధికారులు దిగొచ్చారు. లండన్‌లోని భారత హైకమిషన్ వద్ద భద్రతను బుధవారం సాయంత్రం కట్టుదిట్టం చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు భారీ సంఖ్యలో భద్రతా సిబ్బందినీ నియమించారు. అదే సమయంలో ఖలీస్తానీ సానుభూతిపరులు కొందరు అక్కడికి చేరుకున్నారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన పరిణామాల వెంటనే యూకే అధికారులు ఈ చర్యలకు పూనుకోవడం గమనార్హం.
ఆదివారం లండన్‌లోని భారత హైకమిషన్ వద్ద ఖలీస్తానీ సానుభూతిపరులు సృష్టించిన వీరంగం గురించి తెలిసిందే. ఈ తరుణంలో అక్కడ స్థానిక భద్రతా సిబ్బంది లేకపోవడంపై భారత్ తీవ్ర అసంతృప్తి వెల్లగక్కింది. అయితే భారత హైకమిషన్ వద్ద సెక్యూరిటీ పర్యవేక్షణతో తమకు సంబంధం లేదని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్‌గా బుధవారం నాడు.. ఢిల్లీలోని యూకే హైకమిషన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లు తొలగించడంతో పాటు భద్రత కోసం కేటాయించిన స్థానిక పోలీసు సిబ్బందిని గణనీయంగా తగ్గించింది.
ఈ పరిణామంతో యూకే వెంటనే స్పందించింది. లండన్ భారత హైకమిషన్ వద్ద భద్రతను పెంచింది. సమీప వీధుల్లో గస్తీని పెంచింది. ఇక.. ఆ భద్రతా సిబ్బందిని చూసి నిరసనకారులు.. కాస్త వెనక్కి తగ్గడం గమనార్హం. ఈ ఆదివారం.. ఖలీస్తానీ సానుభూతిపరులు భారత హైకమిషన్‌పై దాడికి యత్నించడం, భారత త్రివర్ణ పతాకాన్ని అవమానించేందుకు యత్నించడం.. ఘటనను భారత్ తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు బ్రిటీష్ సెక్యూరిటీ లేకపోవడం దాడియత్నానికి ఒక కారణంగా పేర్కొంది.
#WATCH | London, UK | Anti-India protests by Khalistanis behind Police barricade. Metropolitan Police on guard at Indian High Commission. pic.twitter.com/YDYKX39Bit
— ANI (@ANI) March 22, 2023
ఇదీ చదవండి: వామ్మో అంతనా?.. ట్రీట్‌మెంట్ బిల్లు చూసి సూసైడ్
Comments
Please login to add a commentAdd a comment