పారిస్: అంతరిక్షంలో ప్రతిధ్వనిస్తున్న శబ్దాలకు సంబంధించిన విశేషాలను ఖగోళ శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. గురుత్వాకర్షణ తరంగాల నుంచి ఉద్భవిస్తున్న ధ్వనులపై ఒక ప్రకటన చేశారు. అంతరిక్షంలో వినిపిస్తున్న శబ్దాలకు సంబంధించిన నేపథ్య(బ్యాక్‌గ్రౌండ్) స్వరాలను గుర్తుపట్టినట్లు తెలియజేశారు. ఈ ప్రయోగంలో భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు సైతం కీలక పాత్ర పోషించడం విశేషం. పుణెలో ఉన్న రేడియో టెలిస్కోప్‌కు ఆ ధ్వని తరంగాలు చిక్కాయి.
దాదాపు 15 ఏళ్ల నుంచి ఆ డేటాను సేకరిస్తున్నారు. అంతరిక్షంలోని సుదూర ప్రాంతాల నుంచి ఆ లయబద్ధమైన శబ్దాలు(హమ్మింగ్) వస్తున్నట్లు తేల్చారు. నార్త్ అమెరికన్ నానోహెట్జ్ అబ్జర్వేటరీ ఫర్ గ్రావిటేషన్ వేవ్స్ బృందం ఆధ్వర్యంలో ఈ అధ్యయనం నిర్వహించారు. ఇండియా, కెనడా, యూరప్, చైనా, ఆ్రస్టేలియా ఖగోళ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. పల్సర్స్ అనే మండిన నక్షత్రాల నుంచి గురుత్వాకర్షణ తరంగాలు వస్తున్నట్లు గుర్తించారు. ఇవి శక్తివంతమైన గురుత్వాకర్షణ శబ్దాలను సృష్టిస్తున్నట్లు తేల్చారు. అంతరిక్షంలో గురుత్వాకర్షణ తరంగాల నుంచి శబ్దాలు వెలువడుతున్నట్లు శతాబ్దం క్రితమే ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment