Gravitational waves
-
అంతరిక్షంలో నేపథ్య గానం!
పారిస్: అంతరిక్షంలో ప్రతిధ్వనిస్తున్న శబ్దాలకు సంబంధించిన విశేషాలను ఖగోళ శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. గురుత్వాకర్షణ తరంగాల నుంచి ఉద్భవిస్తున్న ధ్వనులపై ఒక ప్రకటన చేశారు. అంతరిక్షంలో వినిపిస్తున్న శబ్దాలకు సంబంధించిన నేపథ్య(బ్యాక్‌గ్రౌండ్) స్వరాలను గుర్తుపట్టినట్లు తెలియజేశారు. ఈ ప్రయోగంలో భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు సైతం కీలక పాత్ర పోషించడం విశేషం. పుణెలో ఉన్న రేడియో టెలిస్కోప్‌కు ఆ ధ్వని తరంగాలు చిక్కాయి. దాదాపు 15 ఏళ్ల నుంచి ఆ డేటాను సేకరిస్తున్నారు. అంతరిక్షంలోని సుదూర ప్రాంతాల నుంచి ఆ లయబద్ధమైన శబ్దాలు(హమ్మింగ్) వస్తున్నట్లు తేల్చారు. నార్త్ అమెరికన్ నానోహెట్జ్ అబ్జర్వేటరీ ఫర్ గ్రావిటేషన్ వేవ్స్ బృందం ఆధ్వర్యంలో ఈ అధ్యయనం నిర్వహించారు. ఇండియా, కెనడా, యూరప్, చైనా, ఆ్రస్టేలియా ఖగోళ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. పల్సర్స్ అనే మండిన నక్షత్రాల నుంచి గురుత్వాకర్షణ తరంగాలు వస్తున్నట్లు గుర్తించారు. ఇవి శక్తివంతమైన గురుత్వాకర్షణ శబ్దాలను సృష్టిస్తున్నట్లు తేల్చారు. అంతరిక్షంలో గురుత్వాకర్షణ తరంగాల నుంచి శబ్దాలు వెలువడుతున్నట్లు శతాబ్దం క్రితమే ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వెల్లడించారు. -
అక్కడ ఎవరున్నారు?!
-
అక్కడ ఎవరున్నారు?!
బెంగళూరు : అంతరిక్ష పరిశోధనల్లో ఇదొక అద్భుతం. విశ్వంలో ఎన్నో పాలపుంతలు.. నక్షత్ర మండలాలు ఉన్నాయి. అందులో భూమిని పోలిన గ్రహాలు, మనిషిలా ఆలోచించే జీవులు ఉన్నాయా? అనే ప్రశ్నలు సుదీర్ఘకాలంగా వస్తున్నాయి. వాటికి సమాధానలు కనుగొనేందుకు అనేక దేశాల శాస్త్రవేత్తలు బృందాలుగా మారి పరిశోధనలు చేస్తున్నారు. అంతరిక్షం నుంచి వచ్చే గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు శాస్త్రవేత్తల బృందాలు పరిశోధనలు చేస్తున్నాయి. అందులో భాగంగా 67 మంది భారతీయ శాస్త్రవేత్తలు లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్సర్వేటరీ (లిగో)లో పని చేస్తున్నారు. ఇందులో విశేషమేముంది.. అనుకుంటే.. ఇప్పటివరకూ వేలవేల కాంతినక్షత్రాల దూరం నుంచి వచ్చే గురుత్వాకర్షణ తరంగాలను భారతీయ శాస్త్రవేత్తలు గుర్తించారు. తాజాగా.. ఆగస్టు 14న నాలుగు శక్తివంతమైన గురుత్వాకర్షణ తరంగాలను ఇండియన్ సైంటిస్టులు గుర్తించారు. అందులో శక్తివంతమైన రెండు తరంగాలు బ్లాక్‌హోల్ ఆవల నుంచి వచ్చినట్లు చెబుతున్నారు. అమెరికా కేంద్రంగా పనిచేసే లిగో, ఐరోపా కేంద్రంగా పనిచేసే విర్గో సంస్థలు సంయుక్తంగా గురుత్వాకర్షణ తరంగాలపై పరిశోధనలు చేస్తున్నాయి. భారతీయ శాస్ర్తవేత్తలు భాగస్వాములుగా ఉన్న లిగో.. గురుత్వ తరంగాలపై మరింత వేగంగా పరిశోధనలు చేస్తోంది. తాజాగా కనుగొన్నబడ్డ గురుత్వ తరంగాలు.. 1.8 బిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు సైంటిస్టులు చెబుతున్నారు. లిగో-ఇండియా అంతరిక్ష పరిశోధనల్లో గురత్వ తరంగాలను గుర్తించడం.. అద్భుతమైన విషయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గురుత్వ తరంగాలను గుర్తించడం వల్ల.. అంతరిక్షంలో ఎవరో, ఎక్కడో, మనలను పోలిన, లేక మనకన్నా ముందున్న వారు ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చని లిగో సైంటిస్టులు అంటున్నారు. శక్తింతమైన..! అంతరిక్షం నుంచి జవాబులుగా వచ్చిన గురుత్వ తరంగాల్లో మొదటిది చాలా శక్తివంతమేకాక.. అంత్యంత శబ్ందతో కూడుకున్నదని భారతీయ శాస్త్రవేత్తలు గుర్తించారు. రెండో తరంగం బలహీనంగా ఉండడమేకాక అందులో విభిన్న శబ్దాలు కలిశాయని.. చెబుతున్నారు. ఈ తరంగాలు కేవలం ఒకటి రెండు సెకండ్లు మాత్రమే ఫ్రీక్వెన్సీ బాండ్ మీద రికార్డయినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డాటా ఎనాలసిస్ గురుత్వ తరంగాలను విశ్లేషణ తరువాత ఏదైనా అంచనాకు రాగలమని.. లిగో ఇండియా టీమ్‌కు నాయకత్వం వహిస్తున్న సంజీవ్ ధురంధర్ చెబుతున్నారు. డాటా విశ్లేషణ అనేది తొలిఅడుగుగా ఆయన అభివర్ణించారు. బ్లాక్‌హోల్స్ నుంచి వచ్చిన గురుత్వ తరంగాలను గుర్తించడం అనేది.. మనం సాధించిన అతి పెద్ద విజయమని.. కగోళశాస్త్రంలో మనం ముందున్నమని చెప్పడానికి ఇదొక నిదర్శమని మరో శాస్త్రవేత్త బాల అయ్యర్ చెప్పారు. భారత్‌లో కేంద్రాలు లిగోలో బాగంగా భారత్‌లో మొత్తం 13 కేంద్రాలున్నాయి. ఇందులో 67 మంది శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. లిగో ఇండియా టీమ్‌లో భాగంగా సీఎంఐ-చెన్నై, ఐసీటీఎస్- బెంగళూరు, ఐఐఎస్ఇఆర్-కోల్‌కతా, ఐఐఎస్ఇఆర్-తిరువనంతపురం, ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్, ఐపీఆర్ గాంధీనగర్, ఐయూసీఏఏ పూణే, ఆర్ఆర్సీఏటీ ఇండోర్, టీఐఎఫ్ఆర్ ముంబై, యూఏఐఆర్ గాంధీనగర్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. లిగో డేటాను బెంగళూరు, పూణే కేంద్రాల్లో విశ్లేషణ చేస్తారు. -
ఐన్‌స్టీన్ వందేళ్ల నాటి మాటే నిజమైంది!
జర్మనీకి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ వందేళ్ల కిందట చెప్పిన విషయం నేడు ప్రయోగపూర్వకంగా వెలుగులోకి వచ్చింది. గురుత్వాకర్షణ తరంగాలను దాదాపు వందేళ్ల కిందట ఐన్ స్టీన్ ప్రస్తావించారు. అంతరిక్షంలో వాటి ఉనికిని, సమయానికి అనుగుణంగా అవి ఎలా ప్రవర్తిస్తాయన్న అంశాలపై అప్పట్లోనే ఐన్‌స్టీన్ వివరించారు. సాపేక్ష సిద్ధాంతం అంశాలపై అమెరికన్ శాస్త్రవేత్తలు నేటికీ పరిశోధన చేస్తూనే ఉన్నారు. గురుత్వాకర్షణ తరంగాలను గతంలో ఉన్నట్లు గుర్తించినప్పటికీ వాటిని మన కంటికి కనిపించేలా చేసే సాధనాలను సైంటిస్టులు రూపొందించలేదు. బుధవారం తమ కృషి ఫలించిందని, ఆ తరంగాలను చూపించే సాధనం లేసర్ ఇంటర్ ఫెరో మీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ(లిగో)ను వాడి ఉనికిని గుర్తించారు. అంతరక్ష విజ్ఞానంలో శాస్త్రవేత్తలు మరో అడుగు ముందుకెశారని చెప్పవచ్చు. 1.4 బిలియన్ సంవత్సరాల వయసున్న బ్లాక్ హోల్స్ రెండు ఢీకొనగా గురుత్వాకర్షణ తరంగాలు ఏర్పడ్డట్లు కనుగొన్నారు. లిగోను ఉపయోగించి అంతుచిక్కని ఎన్నో అంతరిక్ష సంబంధ అంశాలకు సమాధానాలు రాబడతామని అమెరికన్ సైంటిస్టులు ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కృష్ణబిలాలు (బ్లాక్ హోల్స్) ఎలా ఏర్పడతాయి, వాటితో పాటు మరిన్ని అంతరిక్ష రహస్యాలను ఛేదిస్తామని గ్లాస్గో యూనివర్సిటీ గ్రావిటేషనల్ రీసెర్చ్ టీమ్ డైరెక్టర్ షైలా రోవాన్ పేర్కొన్నారు. లిగో రెండు డిటెక్టర్స్ కలిగి ఉండగా, ఒకటి లివింగ్ స్టన్, లూసియానాలో, మరొకటి వాషింగ్టన్ లోని హంఫోర్డ్ లో మూడు వేల కి.మీ దూరంలో ఉన్నాయి. కొన్నిసార్లు రెండు బ్లాక్ హోల్స్ ఒకదాని చుట్టూ మరొకటి పరిభ్రమిస్తూ తమ శక్తిని కోల్పోయి ఒక బ్లాక్ హోల్ గా ఏర్పడతాయి. గురుత్వాకర్షణ తరంగాల సహాయంతో బ్లాక్ హోల్స్ కలయిక దృగ్విషయాన్ని తెలుసుకునేందుకు వీలుంటుంది. -
'తరంగాల'ను కనిపెట్టిన శాస్త్రవేత్తల్లో 37 మంది మనోళ్లే!
విఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన, వందేళ్లకు పైగా మిస్టరీగా ఉన్న గురుత్వాకర్షణ తరంగాలను శాస్త్రవేత్తలు గురువారం కనుగొన్న విషయం తెలిసిందే. ఈ పరిశోధనల్లో పాల్గొన్న వారిలో 37 మంది భారత సంతతికి చెందిన శాస్త్రవేత్తలు ఉండడం గమనార్హం. సుమారు దశాబ్దం కిందటే పుణెలోని ఇంటర్ యూనివర్సీటీ ఫర్ ఆస్ట్రనమీ, ఆస్ట్రోఫిజిక్స్‌కి చెందిన సంజీవ్‌దురందర్, సత్యప్రకాశ్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించే పద్ధతిని కనుగొన్నారు. ఈ ప్రయోగంలో పుణె,ముంబై,బెంగళూరుకి చెందిన సుమారు 30 మంది శాస్త్రవేత్తలు పాలుపంచుకున్నారు. సుమారు రూ.వెయ్యి కోట్లతో గురుత్వాకర్షణ తరంగాలపై పరిశోధనల నిమిత్తం ‘లేజర్ ఇన్ఫర్మేషన్ గ్రావిటేష్నల్ వేవ్ అబ్సర్వేటరీ’ (లిగో)ని భారత్‌లో ఏర్పాటు చేయనున్నారు. దీన్ని భారత్, అమెరికా సమ్యుక్తంగా నిర్వహించనున్నారు. అమెరికా 140 మిలియన్ డాలర్ల విలువైన పరికరాలను సమకూర్చనుంది. ప్రయోగంలో భాగస్వామ్యులైనా భారత శాస్త్రవేత్తలకు ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. -
గురుత్వాకర్షణ తరంగాలకు.. తారల తళుకులకు లింకు!
న్యూయార్క్: విశ్వంలో అదృశ్యరూపంలో ప్రయాణిస్తూ ఉండే గురుత్వాకర్షణ తరంగాలకు, నక్షత్రాల ప్రకాశానికి సంబంధం ఉందట! ఈ లింకు ఆధారంగా గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించొచ్చని న్యూయార్క్‌లోని అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ ఖగోళ భౌతికశాస్త్రవేత్త బారీ మెక్‌కెర్నాన్ వెల్లడించారు. విశ్వంలో పెద్ద గురుత్వాకర్షణ తరంగాలు తమచుట్టూ తాము వేగంగా తిరిగే పెద్ద సైజు ద్రవ్యరాశుల వల్ల ఉత్పత్తి అవుతాయని తెలిపారు. విశ్వంలో గురుత్వాకర్షణ తరంగాల ఉనికిపై ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతంలో ప్రతిపాదించారు. అయితే, గురుత్వాకర్షణ తరంగాల ప్రభావం పదార్థంపై స్వల్పంగానే ఉంటుందని భావిస్తుండగా.. కృష్ణబిలాల వంటి పెద్ద సైజు పదార్థాల నుంచి ఉత్పత్తి అయ్యే గురుత్వాకర్షణ తరంగాలు పదార్థంపై ఎక్కువగానే ప్రభావం చూపుతాయని ప్రస్తుత అంచనా. కానీ, భూమి, అంతరిక్షం నుంచి లేజర్ కిరణాల ప్రయోగాలతోనే గురుత్వ తరంగాలను అంచనా వేస్తున్నారు. అయితే, ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతున్న అతిశక్తిమంతమైన రెండు కృష్ణబిలాల నుంచి వచ్చే గురుత్వ తరంగాల వల్ల సమీపంలోని పెద్దనక్షత్రాలన్నీ ఒకేసారి ప్రకాశవంతంగా మెరిసిపోతాయని, ఆ తర్వాత చిన్న నక్షత్రాలు మెరుస్తాయని, దీన్ని బట్టి గురుత్వ తరంగాలను గుర్తించవచ్చని మెక్‌కెర్నాన్ పేర్కొన్నారు.