బెంగళూరు : అంతరిక్ష పరిశోధనల్లో ఇదొక అద్భుతం. విశ్వంలో ఎన్నో పాలపుంతలు.. నక్షత్ర మండలాలు ఉన్నాయి. అందులో భూమిని పోలిన గ్రహాలు, మనిషిలా ఆలోచించే జీవులు ఉన్నాయా? అనే ప్రశ్నలు సుదీర్ఘకాలంగా వస్తున్నాయి. వాటికి సమాధానలు కనుగొనేందుకు అనేక దేశాల శాస్త్రవేత్తలు బృందాలుగా మారి పరిశోధనలు చేస్తున్నారు. అంతరిక్షం నుంచి వచ్చే గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు శాస్త్రవేత్తల బృందాలు పరిశోధనలు చేస్తున్నాయి. అందులో భాగంగా 67 మంది భారతీయ శాస్త్రవేత్తలు లేజర్ ఇంటర్‌ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్సర్వేటరీ (లిగో)లో పని చేస్తున్నారు. ఇందులో విశేషమేముంది.. అనుకుంటే.. ఇప్పటివరకూ వేలవేల కాంతినక్షత్రాల దూరం నుంచి వచ్చే గురుత్వాకర్షణ తరంగాలను భారతీయ శాస్త్రవేత్తలు గుర్తించారు. తాజాగా.. ఆగస్టు 14న నాలుగు శక్తివంతమైన గురుత్వాకర్షణ తరంగాలను ఇండియన్ సైంటిస్టులు గుర్తించారు. అందులో శక్తివంతమైన రెండు తరంగాలు బ్లాక్‌హోల్ ఆవల నుంచి వచ్చినట్లు చెబుతున్నారు.
అమెరికా కేంద్రంగా పనిచేసే లిగో, ఐరోపా కేంద్రంగా పనిచేసే విర్గో సంస్థలు సంయుక్తంగా గురుత్వాకర్షణ తరంగాలపై పరిశోధనలు చేస్తున్నాయి. భారతీయ శాస్ర్తవేత్తలు భాగస్వాములుగా ఉన్న లిగో.. గురుత్వ తరంగాలపై మరింత వేగంగా పరిశోధనలు చేస్తోంది. తాజాగా కనుగొన్నబడ్డ గురుత్వ తరంగాలు.. 1.8 బిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు సైంటిస్టులు చెబుతున్నారు.
లిగో-ఇండియా
అంతరిక్ష పరిశోధనల్లో గురత్వ తరంగాలను గుర్తించడం.. అద్భుతమైన విషయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గురుత్వ తరంగాలను గుర్తించడం వల్ల.. అంతరిక్షంలో ఎవరో, ఎక్కడో, మనలను పోలిన, లేక మనకన్నా ముందున్న వారు ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చని లిగో సైంటిస్టులు అంటున్నారు.
శక్తింతమైన..!
అంతరిక్షం నుంచి జవాబులుగా వచ్చిన గురుత్వ తరంగాల్లో మొదటిది చాలా శక్తివంతమేకాక.. అంత్యంత శబ్ందతో కూడుకున్నదని భారతీయ శాస్త్రవేత్తలు గుర్తించారు. రెండో తరంగం బలహీనంగా ఉండడమేకాక అందులో విభిన్న శబ్దాలు కలిశాయని.. చెబుతున్నారు. ఈ తరంగాలు కేవలం ఒకటి రెండు సెకండ్లు మాత్రమే ఫ్రీక్వెన్సీ బాండ్ మీద రికార్డయినట్లు సైంటిస్టులు చెబుతున్నారు.
డాటా ఎనాలసిస్
గురుత్వ తరంగాలను విశ్లేషణ తరువాత ఏదైనా అంచనాకు రాగలమని.. లిగో ఇండియా టీమ్‌కు నాయకత్వం వహిస్తున్న సంజీవ్ ధురంధర్ చెబుతున్నారు. డాటా విశ్లేషణ అనేది తొలిఅడుగుగా ఆయన అభివర్ణించారు. బ్లాక్‌హోల్స్ నుంచి వచ్చిన గురుత్వ తరంగాలను గుర్తించడం అనేది.. మనం సాధించిన అతి పెద్ద విజయమని.. కగోళశాస్త్రంలో మనం ముందున్నమని చెప్పడానికి ఇదొక నిదర్శమని మరో శాస్త్రవేత్త బాల అయ్యర్ చెప్పారు.
భారత్‌లో కేంద్రాలు
లిగోలో బాగంగా భారత్‌లో మొత్తం 13 కేంద్రాలున్నాయి. ఇందులో 67 మంది శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. లిగో ఇండియా టీమ్‌లో భాగంగా సీఎంఐ-చెన్నై, ఐసీటీఎస్- బెంగళూరు, ఐఐఎస్‌ఇఆర్-కోల్‌కతా, ఐఐఎస్‌ఇఆర్-తిరువనంతపురం, ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్, ఐపీఆర్ గాంధీనగర్, ఐయూసీఏఏ పూణే, ఆర్‌ఆర్‌సీఏటీ ఇండోర్, టీఐఎఫ్‌ఆర్ ముంబై, యూఏఐఆర్ గాంధీనగర్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. లిగో డేటాను బెంగళూరు, పూణే కేంద్రాల్లో విశ్లేషణ చేస్తారు.