
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తమ పార్టీ నాయకురాలు, అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి కమలా హ్యారీస్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ఆమె పౌర హక్కులకు మద్దతుపలికే స్ఫూర్తిదాయక నాయకురాలని అన్నారు. టెక్సాస్‌లోని ఆస్టిన్‌లోని లిండాల్ బి. జాన్సన్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీలో ప్రసంగించిన ఆయన తనకు పాలనలో కమలా హ్యారీస్ అద్భుత భాగస్వామ్యం అందించారని పేర్కొన్నారు.
కమలా హ్యారీస్ పౌర హక్కుల విషయంలో తన గొంతును సమర్థవంతంగా వినిపిస్తూ, స్ఫూర్తిదాయక నాయకురాలుగా కొనసాగుతున్నారన్నారు. అమెరికా వైఖరిలో అందరూ సమానులే అని, తాము ఈ ఆలోచనకు ఎప్పుడూ దూరంగా వెళ్లలేదన్నారు. ఇప్పుడు కమలా కూడా ఈ స్ఫూర్తిని కొనసాగిస్తారని భావిస్తున్నానన్నారు. 81 ఏళ్ల జో బైడెన్ తాను ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అదేసమయంలో ఆయన కమలా హ్యారీస్‌కు(59)కు తన మద్దతును ప్రకటించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా కమలా హ్యారీస్‌కు మద్దతు పలికారు.