న్యూయార్క్: భారత్, కెనడా దౌత్యసంబంధాలు రోజురోజుకి క్షిణిస్తున్నాయి. సిక్కు వేర్పాటువాది, ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారతీయ హైకమిషన్ పేరును కెనడా చేర్చిన విషయం తెలిసిందే. ఈ వ్యహారాన్ని భారత్ తీవ్రంగా ఖండిచింది. అయితే తాజాగా పరిణామాలపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. కెనడా చేస్తున్న ఆరోపణలను భారత్ తీవ్రంగా పరిగణించాలని తెలిపింది.
‘‘కెనడా విషయానికి వస్తే.. భారత్‌పై చేస్తున్న ఆరోపణలు చాలా తీవ్రమైనవి. భారత్ వాటిని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. కెనడా దర్యాప్తులో భారత ప్రభుత్వం సహకరించాలని మేము కోరుకుంటున్నాం’’ అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అన్నారు.
సిక్కు వేర్పాటువాదులకు వ్యతిరేకంగా జరుగుతున్న వ్యతిరేక కార్యకాలపాల్లో భారత ప్రమేయం ఉందని గతంలో కెనడా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారతదేశం, కెనడా సోమవారం పరస్పరం రాయబారులను బహిష్కరించుకున్నాయి. కెనడాలో నేర కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం ద్వారా భారత ప్రభుత్వం.. ప్రాథమిక తప్పు చేసిందని కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేశారు.
VIDEO | India-Canada row: “We have urged them (India and Canada) to cooperate, and we’ll continue to do that. I will defer to those two countries to speak to the relevant status of the matter,” said US State Department Spokesperson Matthew Miller (@StateDeptSpox) at a press… pic.twitter.com/UcsiqxuEfd
— Press Trust of India (@PTI_News) October 15, 2024
Comments
Please login to add a commentAdd a comment