పుణె : ఇటీవల గుజరాత్‌లోని పోర్‌బందర్ తీరానికి సమీపంలో క్రూడాయిల్ నౌకపై జరిగిన డ్రోన్ దాడి ఇరాన్ నుంచే జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. డ్రోన్‌లో నుంచి వచ్చిన పేలుడు పదార్థం ఇరానియన్ 136 లాయిటరింగ్ అమ్యూనిషన్ అని పుణెలోని సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చినట్లు సమాచారం.
రష్యన్ జిరాన్ -2 ఎక్స్‌ప్యాండబుల్ రకానికి చెందిన ఈ డ్రోన్ 2500 కిలోమీటర్ల రేంజ్ ప్రయాణించగలదు. దీనిలో 50 కిలోల వార్‌హెడ్ ఉంది. వార్‌హెడ్‌లో షాహెద్ 136 అనే పేలుడు పదార్థం వాడారని తెలుస్తోంది. అయితే పుణె ల్యాబ్ పూర్తిస్థాయి నివేదిక రావడానికి వారం రోజులు సమయం పట్టే అవకాశం ఉంది.
సమీపంలోని రెండు ఇరానియన్ షిప్పుల నుంచే క్రూడాయిల్ నౌకపై డ్రోన్ దాడి జరిగిందని తొలుత భావించారు. అయితే ఆ రెండు నౌకలను తనిఖీ చేసిన తర్వాత వాటికి ఈ దాడితో ఎలాంటి సంబంధం లేదని నేవీ అధికారులు తేల్చారు.
Comments
Please login to add a commentAdd a comment