ఆఫ్రికా/అస్మారా: ప్రస్తుతం మనిషి సగటు జీవిత కాలం 65-70 ఏళ్లు. మనకంటే 20-30 ఏళ్ల ముందు వారి ఆయుర్దాయం 80-90 ఏళ్లు. ఇక ఎక్కడో ఓ చోట కొందరు శతాధిక వృద్ధులు తారసపడుతుంటారు. ఇప్పటి వరకు మనం 100 ఏళ్ల కు పైబడిన వారి గురించి విన్నాం.. చూశాం. కానీ ఇప్పుడు మీరు చదవబోయే ఈ వార్తలోని వ్యక్తి ప్రపంచంలో అత్యధిక కాలం జీవించిన మనిషిగా రికార్డు సృష్టించబోతున్నాడు. కాకపోతే మరణించిన తర్వాత. సదరు వ్యక్తి 127 సంవత్సరాల వయసులో మరణించాడని.. అతడని అత్యధిక కాలం జీవించిన వ్యక్తిగా గుర్తించాల్సిందిగా గిన్నిస్ రికార్డ్ బుక్ ప్రతినిధులను కోరారు మరణించిన వృద్ధుడి కుటుంబ సభ్యులు. ఆ వివరాలు..
ఆఫ్రికాలోని అజెఫాలో ఎరిత్రియాకు చెందిన నటాబే మాచేట్ సోమవారం మరణించాడు. ప్రస్తుతం నటాబే వయసు 127 సంవత్సరాలని అతడి కుటుంబ సభ్యులు వెల్లడించారు. అందుకే అతని కుటుంబం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నటాబేని అత్యంత కాలం జీవించిన వ్యక్తిగా అధికారికంగా గుర్తించాలని కోరింది. ఈ క్రమంలో నటాబే మనవడు జీర్ తన తాత పుట్టుకకు సంబంధించిన పత్రాలను గిన్నిస్ బుక్ వాళ్లకు అందించాడు.
(చదవండి: లాంగెస్ట్ కిస్.. గురక వీరుడు ఇంట్రస్టింగ్ వరల్డ్ రికార్డులు)
చర్చి రికార్డులు ప్రకారం 1894లో నటాబే జన్మించినట్లు జనన ధ్రువీకరణ పత్రంలో ఉందన్నాడు జీర్. అయితే ఆయన జన్మించిన పదేళ్ల తర్వాత బాప్టిజం పొందాడని తెలిపాడు. దీని ఆధారంగా తన తాత 127 ఏళ్లు బతికినట్లు తను ఇచ్చిన సమాచారాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ధృవీకరిస్తున్నాయని జీర్ తెలిపాడు. సహనం, దాతృత్వం, సంతోషకరమైన జీవితమే.. నటాబే సుదీర్ఘకాలం జీవించడానికి కారమణమని మీడియాకు వెల్లడించారు అతడి కుటుంబ సభ్యులు.
తన తాత “అసాధారణమైన వ్యక్తి” అని జీర్ తెలిపాడు. 1934 లో నటాబే వివాహం చేసుకున్నాడని తెలిపాడు. తాత-నానమ్మలిద్దరూ సుద్ఘీకాలం జీవించారన్నాడు. నటాబే భార్య 2019 లో 99 సంవత్సరాల వయసులో మరణించింది. నటాబే తన జీవితంలో ఎక్కువ భాగం పశువుల కాపరిగా గడిపాడని జీర్ తెలిపాడు. 2014 లో, నటాబే 120 వ పుట్టినరోజును గ్రామం మొత్తం జరుపుకుంది.
(చదవండి: ఈ సమంత టాలెంట్ తెలిస్తే...‘నోరెళ్ల’ బెడతారు)
ప్రస్తుత అత్యధిక కాలం జీవించిన రికార్డు జీన్ కాల్మెంట్ అనే ఫ్రెంచ్ మహిళ పేరు మీద ఉంది. ఆమె 1997లో 122 సంవత్సరాల వయసులో మరణించాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ఎక్కువ కాలం బతికిన వ్యక్తిగా జపాన్‌కు చెందిన జిరోమోన్ కిమురా ఉన్నాడు. అతను 2013 లో 116 సంవత్సరాల వయసులో మరణించాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నుంచి సమాధానం కోసం నటాబే కుటుంబం ఎదురుచూస్తోంది.
చదవండి: చావునుంచి తప్పించుకోవచ్చేమో, కామాక్షి నుంచి తప్పించుకోలేరు?!
Comments
Please login to add a commentAdd a comment