బీజింగ్: దక్షిణ చైనాలోని పాంఝౌ నగరం గుయిజౌ ప్రావిన్స్‌లోని బొగ్గుగనిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. గని యజమాని గుయిజౌ పంజియాంగ్ షాంఘై స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో కనీసం 16 మంది కార్మికులు మరణించారన్నారు.
పాంఝౌ నగర భద్రతాధికారుల ప్రాధమిక దర్యాప్తులో గుయిజో బొగ్గుగనిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని ఎంత ప్రయత్నించినా అదుపు కాలేదని చాలాసేపు ప్రయత్నించగా చివరకు ఎలాగో మంటలు అదుపులోకి వచ్చాయని తెలిపారు. కన్వేయర్ బెల్టుకు మంటలు అంటుకోవడం వల్లనే అగ్నిప్రమాదం జరిగిందని అక్కడున్నవారిలో కొందరు సురక్షితంగా బయటపడినా 16 మంది మాత్రం మంటల్లో చిక్కుకుని మరణించారని తెలిపారు. పంజియాంగ్ కంపెనీకి మొత్తం 7 బొగ్గు గనులని నిర్వహిస్తోందని మొత్తంగా 17.3 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తుందని అన్నారు.
అగ్నిప్రమాదం తర్వాత షాంఘైలోని కమొడిటీస్ కన్సల్టెన్సీ మిస్టీల్ ఒకరోజు పాటు పాంఝౌ నగరంలోని అన్ని బొగ్గు గనుల్లోనూ ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. గుయిజౌకు చెందిన బొగ్గుగని భద్రతా విభాగం సంఘటన గురించి తమకు ఎటువంటి సమాచారం లేదని తెలిపింది. మిస్టీల్ తెలిపిన వివరాలు ప్రకారం ప్రమాదం జరిగిన బొగ్గు గనిలో ఒక ఏడాదికి 52.5 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుందని ఇది చైనా మొత్తం బొగ్గు ఉత్పత్తిలో ఐదు శాతం అని తెలిపింది.
ఇది కూడా చదవండి: ఖలిస్తానీ ఉగ్రవాదుల ఓసీఐ కార్డులు రద్దు?
Comments
Please login to add a commentAdd a comment