Friend Of Imran Khan Wife Bushra Bibi Left Pakistan Amid Corruption Allegations - Sakshi
Sakshi News home page

ఇమ్రాన్‌ ఖాన్‌కు మరో ట్విస్ట్‌.. తెరపైకి మూడో భార్య ఫ్రెండ్‌ వ్యవహారం

Published Wed, Apr 6 2022 11:37 AM | Last Updated on Wed, Apr 6 2022 5:46 PM

Friend Of Imran Khan Wife Bushra Bibi Left Pakistan - Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం కారణంగా ఆ దేశ అసెంబ్లీలో ఊహించని పరిస్థితులు నెలకొన్నాయి. ఇమ్రాన్ ఖాన్ ప్ర‌స్తుతం పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీని ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్రమంలోనే మరో మూడు నెలల్లోగా ముందస్తు ఎన్నికలంటూ ఇమ్రాన్‌ ఖాన్‌ కామెంట్స్‌ చేశాడు. ఆయన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం స్పందిస్తూ.. ఎన్నికల కోసం కనీసం ఆరు నెలల గడువైనా అవసరమని ఈసీ అభిప్రాయపడింది. 

ఇదిలా ఉండగా.. పాక్‌లో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆయ‌న భార్య బుష్రా బీబీ స్నేహితురాలు ఫ‌రాహ్‌ ఖాన్‌ సోషల్‌ మీడియా ట్రెండింగ్‌లో నిలిచారు. ఇమ్రాన్ ఖాన్ భార్య‌ను అడ్డుపెట్టుకొని ఫ‌రాహ్‌ ఖాన్ భారీ అవినీతికి పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. కాగా, ఇమ్రాన్‌ సర్కార్‌ సంక్షోభంలో పడటంతో ఫ‌రాహ్‌ దేశం విడిచి వెళ్లింది. దుబాయ్‌కు వెళ్తున్న స‌మ‌యంలో ఆమె వ‌ద్ద ఉన్న బ్యాగ్‌పై ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. దీనికి కారణం ఆ బ్యాగ్ ధ‌ర సుమారు 90 వేల డాల‌ర్లు అని తెలుస్తోంది. విమానంలో బ్యాగ్‌తో వెళ్తున్న ఫోటోలు వైర‌ల్ కావ‌డంతో.. ఫ‌రాహ్‌ ఖాన్ అవినీతి చరిత్ర బయటకు వస్తోంది. 

మరోవైపు.. బుష్రా బీబీని అడ్డుకుపెట్టుకుని ఫ‌రాహ్‌ ఖాన్ అవినీతికి పాల్పడిందంటూ పీఎంఎల్ న‌వాజ్ పార్టీ నేత కుర్షీద్ ఆల‌మ్ ఆరోపించారు. ప్ర‌భుత్వ‌ ఆఫీస‌ర్ల బ‌దిలీల కోసం వారి వ‌ద్ద నుంచి భారీ స్థాయిలో డబ్బు తీసుకున్నట్టు ఫ‌రాహ్‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇమ్రాన్ ప‌ద‌వి కోల్పోవ‌డంతో.. ఆయ‌న‌తో లింకు ఉన్న స‌న్నిహితులు దేశం విడిచి వెళ్తున్నారని ఆరోపించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement