పాలస్తీనా మిలిలెంట్లు హమాస్, ఇజ్రాయెల్ మధ్య మూడు రోజులుగా భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ పోరులో ఇప్పటి వరకు 1100 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క ఇజ్రాయెల్‌లోనే 44 మంది సైనికులతోపాటు 700 మంది ప్రాణాలు కోల్పోయారు. గాజా స్ట్రిప్ ద్వారా దక్షిణ ఇజ్రాయెల్‌లో చొరబడి దాడులు మొదలు పెట్టింది హమాజ్ అయినా.. ఇజ్రాయెల్ సైన్యం సైతం గాజాపై విరుచుకుపడుతోంది. రాకెట్లు, మిస్సైల్స్‌తో దాడులు జరుపుతోంది.
హమాస్‌పై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్ తాజాగా కీలక నిర్ణయం తీసుకొంది.హమాస్ అధీనంలో ఉన్న గాజాను సైతం పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఈ క్రమంలో గాజాను పూర్తిగా దిగ్బంధించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో గాజాకు వెళ్లే కీలక సరఫరలైన కరెంట్, ఆహారం, ఇంధనంను నిలిపివేసింది. కాగా శనివారం ఉదయం హమాజ్ దాడి మొదలైనప్పటి నుంచి.. ఇజ్రాయెల్ గాజాకు విద్యుత్‌ను కట్ చేయంతో అంధకారాన్ని ఎదుర్కొంటుంది.
దీనిపై ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి యోవో గల్లాంట్ మాట్లాడుతూ.. గాజాను పూర్తిగా దిగ్భంధించమని ఆదేశించినట్లు తెలిపారు. ఇక అక్కడ విద్యుత్, ఆహారం, నీరు, అందదని తెలిపారు. తాము మానవ మృగాలతో పోరాడుతున్నామని, దానికి తగ్గట్లే తమ పోరాటం ఉంటుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా 2007లో పాలస్తీనా బలగాల నుంచి హమాస్ అధికారాన్ని చేజిక్కించుకునన్నప్పటిన ఉంచి గాజాపై ఇజ్రాయెల్, ఈజిప్టు వివిధ స్థాయిలో దిగ్భంధనాలు విధించాయి.
గాజా.. అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతం. 362 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలోనే సుమారుగా 20 లక్షల మంది నివసిస్తున్నారు. ప్రస్తుత యుద్ధంతో వారంతా బిక్కుబిక్కుంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు. గాజాకు తూర్పు, ఉత్తర భాగాల్లో ఇజ్రాయెల్, దక్షిణాన ఈజిప్టు, పశ్చిమ భాగంలో మధ్యదరా సము ద్రం సరిహద్దులుగా ఉన్నాయి. యుద్ధం కారణంగా ఇరుదేశాలు జల, వాయు, భూ దిగ్బంధాన్ని విధించాయి. దీంతో గాజా వాసులు ఎటువెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఎటునుంచి మృత్యువు వస్తుందో తెలియక చావు భయంతో నరకయాతన అనుభవిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment