
జెనీవా: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ మరో కొత్త రూపం సంతరించుకుంది. ‘ఒమిక్రాన్’గా పిలుస్తున్న ఈ వేరియంట్ గతంలో వచ్చినవాటికన్నా.. వేగంగా వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇప్పటికే ఐదు దేశాల్లో ఈ కేసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అసలు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటివరకు ఎన్ని కోవిడ్ వేరియంట్లకు పేర్లు పెంట్టిందో తెలుసుకుందాం.
(చదవండి: పోలీస్ ఇన్‌స్పెక్టర్ సహా ఐదుగురిని చంపేశాడు!)
ఆల్ఫా: యూకేలోని కెంట్‌లో తొలిసారిగా 2020 సెప్టెంబర్‌లో గుర్తించారు. బ్రిటన్‌లో సెకండ్‌వేవ్ ఈ వేరియెంట్‌తోనే విజృంభించింది.
బీటా: దక్షిణాఫ్రికాలో 2020 మేలో గుర్తించారు. ప్రపంచ దేశాల్లో 50% కేసుల్ని ఈ వేరియెంట్ పెంచింది.
గామా: బ్రెజిల్‌లో నవంబర్ 2020లో గుర్తించారు. దక్షిణ అమెరికాలో దీని వ్యాప్తి ఎక్కువగా ఉంది
డెల్టా: భారత్‌లో అక్టోబర్ 2020లో ఈ వైరస్ మొదటిసారి వెలుగులోకి వచ్చింది. ఆసియా, యూరప్‌లో విజృంభించింది. ఇప్పటివరకు వచ్చిన వేరియెంట్‌లలో ఇదే అత్యంత వేగంగా విస్తరించింది. ఆల్ఫా కంటే 60% వేగంగా వ్యాప్తి చెందింది.
ఈటా: డిసెంబర్ 2020లో యూకేలో తొలిసారిగా బయటపడిన ఈ రకం 72 దేశాలకు విస్తరించింది.
లోటా: న్యూయార్క్‌లో 2020లో బయటపడిన ఈ వేరియెంట్ పెద్దగా ప్రభావం చూపించలేదు
కప్పా: భారత్‌లో అక్టోబర్ 2020లో వెలుగు చూసిన కప్పా వేరియెంట్ కేసులు 55 దేశాల్లో వెలుగులోకి వచ్చాయి
లాంబ్డా: డిసెంబర్ 2020లో పెరూలో తొలిసారిగా వెలుగు చూసిన ఈ వేరియెంట్ మూడు నెలల్లోనే 41 దేశాలకు విస్తరించింది.
(చదవండి: యువకుడితో వివాహేతర సంబంధం.. వారిని కరెంట్ స్తంభానికి కట్టేసి..)
Comments
Please login to add a commentAdd a comment