గతేడాది అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ చేసినటువంటి మెరుపు దాడి మళ్లీ జరగకుండా చూసేందుకు దేశంలో భద్రతను మారుస్తున్నట్లు ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ఇజ్రాయెల్‌పై హమాస్ బలగాలు మెరుపుదాడి చేసిన ఘటనకు నేటితో ఏడాది పూర్తి అయింది. ఈ సందర్భంగా ఆనాటి దాడి జరగకుండా చూస్తామని ప్రధాని నెతన్యాహు సోమవారం కేబినెట్ ప్రసంగంలో పేర్కొన్నట్లు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
‘‘మేము మా ప్రాంతంలో భద్రతా మారుస్తున్నాం. మా పిల్లల, భవిష్యత్తు కోసం. గతేడాది అక్టోబర్ ఏడో తేదీన జరిగినవి దాడి మళ్లీ ఇంకెప్పడూ జరగకుండా చూస్తాం. అందు కోసం దేశ భద్రతలో సైతం వాస్తవ మార్పులు తీసుకువస్తాం’’ అని అన్నారు.
ఇజ్రాయెల్‌పై జరిగిన దాడుల మొదటి వార్షికోత్సవం సందర్భంగా 1200 మందికిపైగా అమాయకుల మృతికి ప్రత్యేక సంతాప సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్), భద్రతా సిబ్బంది , రెగ్యులర్, రిజర్వ్, ఆర్మీ , పోలీసు, మొస్సాద్‌లోని సైనిక యోధుల వీరత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మీరు నిర్వహిస్తున్న పనిని పూర్తి చేయాలని తెలిపారు. హమాస్ చేతిలో మిగిలిన బందీలను గాజా నుంచి విడిపించాలని కోరారు.
‘‘మేము నిర్దేశించుకున్న అన్ని లక్ష్యాలను పూర్తి చేసినప్పుడే హమాస్‌పై యుద్ధాన్ని ముగిస్తాం. గాజా హమాస్ పాలనను పడగొడుతాం. హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బంధీలను సురక్షితంగా తీసుకువస్తాం. గాజా నుంచి ఇజ్రాయెల్‌కు భవిష్యత్తులో వచ్చే ముప్పును అడ్డుకుంటాం’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment