Russia-Ukraine War: ఖేర్సన్‌పై పట్టు బిగిస్తున్న ఉక్రెయిన్‌ | Russia-Ukraine War: Russia to evacuate civilians from Kherson | Sakshi
Sakshi News home page

Russia-Ukraine War: ఖేర్సన్‌పై పట్టు బిగిస్తున్న ఉక్రెయిన్‌

Published Sat, Oct 15 2022 5:25 AM | Last Updated on Sat, Oct 15 2022 5:25 AM

Russia-Ukraine War: Russia to evacuate civilians from Kherson - Sakshi

కీవ్‌: రష్యా ఆక్రమిత ఖేర్సన్‌ ప్రాంతంపై ఉక్రెయిన్‌ తిరిగి పట్టు బిగిస్తోంది. ఖేర్సన్‌ను ఉక్రెయిన్‌ మిలటరీ పాక్షికంగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. నిరంతరాయంగా ఆ ప్రాంతంపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ పరిణామాలతో ఖేర్సన్‌ ప్రాంతానికి చీఫ్‌గా నియమితుడైన వ్లాదిమర్‌ సాల్దో ఆ ప్రాంతం నుంచి రష్యాకు ఎవరైనా వెళ్లిపోతామంటే వారికి ఉచితంగా వసతి సదుపాయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చట్టవిరుద్ధంగా ఖేర్సన్‌సహా నాలుగు ప్రాంతాలను తమ భూభాగంలో కలిపేసుకున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఖేర్సన్‌ ప్రాంతంలోని ప్రజల ప్రాణాలను రక్షించడానికి రష్యన్‌ ప్రాంతాలైన రోస్తోవ్, క్రానోడర్, స్ట్రావోపోల్, క్రిమియాకు తరలిస్తామని చెప్పారు. యుద్ధ సమయంలో అనాథమైన వేలాది మంది పిల్లల్ని రష్యాకు బలవంతంగా తరలిస్తోందని, ఇలా చేయడం యుద్ధ నేరాల కిందకే వస్తుందని పలు స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement