స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీలో సుందర్‌ పిచాయ్‌కు చేదు అనుభవం | Stanford students walk out during Sundar Pichai graduation speech | Sakshi
Sakshi News home page

స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీలో సుందర్‌ పిచాయ్‌కు చేదు అనుభవం

Jun 15 2026 12:22 PM | Updated on Jun 15 2026 5:53 PM

Stanford students walk out during Sundar Pichai graduation speech

స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి చేదు అనుభవం ఎదురైంది. ఆయన ప్రసంగం చేస్తుండగా కొందరు విద్యార్థులు వాకౌట్ చేశారు. ప్రభుత్వ మరియు రక్షణ రంగ సంస్థలతో గూగుల్‌ ఒప్పందాలకు నిరసనగా కొంతమంది విద్యార్థుల బృందం సభ నుండి బయటకు వెళ్ళిపోయి నిరసనను వ్యక్తం చేసింది. ప్రభుత్వ, రక్షణ సంబంధిత పనులలో ప్రధాన టెక్ సంస్థల ప్రమేయంపై యూఎస్ క్యాంపస్‌లలో విద్యార్థులు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఈ నిరసన చోటు చేసుకోవడం గమనార్హం.

సాధారణంగా విద్యార్థుల ఆనందోత్సాహాలు, సాధించిన విద్యా విజయాలతో ఎంతో ఉత్సాహంగా జరగాల్సిన ఈ వేడుక  విద్యార్థుల వాకౌట్‌తో కొద్దిసేపు ఉద్రిక్తంగా మారింది.  ప్రసంగం కొనసాగుతుండగా పలువురు గ్రాడ్యుయేట్లు ఒకేసారి లేచి బయటకు వెళ్లిపోయారు. ముఖ్యంగా'స్టూడెంట్స్ ఫర్ జస్టిస్ ఇన్ పాలస్తీనా', 'నో టెక్ ఫర్ అపార్తీడ్' వంటి సామాజిక సంస్థలు ఈ నిరసన చేపట్టాయి. దీంతో పిచాయ్ తన ప్రసంగాన్ని టెక్నాలజీ అంశాలపై లోతైన చర్చకు దూరంగా, పట్టభద్రులకు సాధారణ సలహాలకే పరిమితం చేశారు. ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF), అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ మరియు ఇమ్మిగ్రేషన్ విభాగాలతో గూగుల్ కుదుర్చుకున్న ఒప్పందాలకు వ్యతిరేకంగా విద్యార్థులు  ఈ నిరసన చేపట్టారు.

సుందర్ పిచాయకు బిగ్ షాక్, యూనివర్సిటీలో అవమానం

మరోవైపు ఇటీవల ఇతర యూనివర్సిటీల్లో ఇలాంటి విషయాలపై టెక్ ప్రముఖుల ప్రసంగాలకు విద్యార్థుల నుండి తీవ్ర వ్యతిరేకత  వచ్చిన నేపథ్యంలో 2015 నుండి గూగుల్‌కు నాయకత్వం వహిస్తున్న, స్టాన్‌ఫర్డ్ పూర్వ విద్యార్థి పిచాయ్, తన ప్రసంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లేదా సాంకేతిక రంగ పరిణామాల జోలికి వెళ్లకుండా చాలా జాగ్రత్త పడ్డారు. 

ఇదీ చదవండి : విడాకులు మంజూరు : భర్తను వాటేసుకుని ఎమోషనల్‌, ఎందుకో తెలుసా?


సుందర్ పిచాయ్  సందేశం
పిచాయ్‌ ప్రసంగాన్ని చాలా సరళంగా, వ్యక్తిగత విషయాలకే పరిమితం చేశారు. 1990లలో కాలిఫోర్నియాలో తన తొలి రోజుల నాటి ఒక జ్ఞాపకాన్ని పంచుకున్నారు. అలాగే  ఈ  వేదికపై  "ఏం మాట్లాడకూడదో" తనకు చాలా సలహాలు వచ్చాయంటూ కాస్త హాస్యాన్ని జోడించారు. డిగ్రీ పూర్తి చేసుకుని కొత్తగా కెరీర్ ప్రారంభించబోయే విద్యార్థులు ఎల్లప్పుడూ ఆశావాహ దృక్పథంతో  ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.  

ఇదీ చదవండి: నో స్ట్రిక్ట్‌ డైట్ : శాస్త్రవేత్తలకే షాకిస్తున్న ‘30’ ఏళ్ల బామ్మ ఫిట్‌నెస్‌ సీక్రెట్‌

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement