సముద్రాల్లో షార్క్‌లదే రాజ్యం. వాటికి ఏ జీవి దొరికినా పరపరా నమిలి మింగేస్తాయి. అలాంటి షార్క్‌లలో గ్రేట్ వైట్ షార్క్ జాతికి చెందినవి మరింత పెద్దగా ఉంటాయి. ఈ పెద్ద షార్క్‌లలోనే అతిపెద్దది ‘డీప్ బ్లూ’. ఏకంగా 22 ఫీట్ల పొడవు, రెండున్నర టన్నులకుపైగా బరువున్న ఈ షార్క్‌ను.. 2019లో హవాయి సముద్రతీరంలో మొదటిసారిగా గుర్తించారు. దాని వయసు 50 ఏళ్లకుపైనే ఉంటుందని అంచనా వేశారు.
షార్క్ చేపలతో డైవింగ్ చేసే (షార్క్ డైవర్) ఓసియన్ రామ్సే ధైర్యంగా ఈ ‘డీప్ బ్లూ’కు దగ్గరగా వెళ్లి వీడియో చిత్రీకరించాడు. తర్వాత కూడా అప్పుడప్పుడూ ఈ షార్క్ చాలా మందికి కనిపించింది. అయితే ఎప్పుడూ ఎవరిపై దాడి చేయలేదు. సాధారణంగా గ్రేట్ వైట్ షార్కులు 30–40 ఏళ్లు జీవిస్తాయి. 15 అడుగుల వరకు పొడవు పెరుగుతాయి. కానీ ‘డీప్ బ్లూ’ ఏకంగా 22 అడుగుల పొడవు ఉండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment