sharks
-
షార్క్‌లకే షాకిచ్చే షార్క్..
సముద్రాల్లో షార్క్లదే రాజ్యం. వాటికి ఏ జీవి దొరికినా పరపరా నమిలి మింగేస్తాయి. అలాంటి షార్క్‌లలో గ్రేట్ వైట్ షార్క్ జాతికి చెందినవి మరింత పెద్దగా ఉంటాయి. ఈ పెద్ద షార్క్లలోనే అతిపెద్దది ‘డీప్ బ్లూ’. ఏకంగా 22 ఫీట్ల పొడవు, రెండున్నర టన్నులకుపైగా బరువున్న ఈ షార్క్‌ను.. 2019లో హవాయి సముద్రతీరంలో మొదటిసారిగా గుర్తించారు. దాని వయసు 50 ఏళ్లకుపైనే ఉంటుందని అంచనా వేశారు. షార్క్ చేపలతో డైవింగ్ చేసే (షార్క్ డైవర్) ఓసియన్ రామ్సే ధైర్యంగా ఈ ‘డీప్ బ్లూ’కు దగ్గరగా వెళ్లి వీడియో చిత్రీకరించాడు. తర్వాత కూడా అప్పుడప్పుడూ ఈ షార్క్ చాలా మందికి కనిపించింది. అయితే ఎప్పుడూ ఎవరిపై దాడి చేయలేదు. సాధారణంగా గ్రేట్ వైట్ షార్కులు 30–40 ఏళ్లు జీవిస్తాయి. 15 అడుగుల వరకు పొడవు పెరుగుతాయి. కానీ ‘డీప్ బ్లూ’ ఏకంగా 22 అడుగుల పొడవు ఉండటం గమనార్హం. -
ఇలా షార్క్ లు వెళ్లడం ఎప్పుడైనా చూశారా?
-
నాకు ఆ సినిమా గుర్తొస్తుంది..హర్ష్ గోయెంకా ఆసక్తికర వ్యాఖ్యలు!
షార్క్ ట్యాంక్ ఇండియా..! ప్రతిభావంతులైన ఎంట్రప్రెన్యూర్లను వెలుగులోకి తెచ్చేందుకు సోనీ ఎంటర్టైన్మెంట్ నిర్వహిస్తున్న కార్యక్రమం ఇది. అమెరికాలో విజయవంతమైన ‘షార్క్ ట్యాంక్ షో’ దీనికి స్ఫూర్తి. ఇలాంటి షోలు ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వరకు ఉన్నాయి. అన్ని చోట్లా ప్రజలకు ఉపయోగపడే ఆవిష్కరణలకే అవకాశం ఇస్తున్నారు. ఇప్పటికే ఈ షో మొదటి సీజన్ 2021లో విజయవంతంగా ముగిసింది. ఇప్పుడు షార్క్ ట్యాంక్ ఇండియా రెండో సీజన్ ప్రారంభమైంది. అయితే విమర్శకుల నుంచి ప్రశంసలు పొందుతున్న ఈ కార్యక్రమంపై భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త, ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా ఆసక్తకిర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్ని షో జడ్జ్ అనుపమ్ మిట్టల్ ఖండించారు. హర్ష్ గోయెంకా ఏమన్నారంటే? ఎప్పుడూ మోటివేషన్, లేదా రోజూ వారి సామాజిక మాద్యమాల్లో జరిగే ఘటనల గురించి మాట్లాడే హర్ష్ గోయెంకా.. ఈ సారి రూటు మార్చారు. షార్క్ ట్యాంక్ షో జడ్జెస్ గురించి, వాళ్లు చేసే బిజినెస్ గురించి స్పందించారు. దేశానికి చెందిన స్టార్టప్‌లు పెద్దమొత్తంలో నష్టపోతున్నాయంటూ.. వారి నష్టాన్ని 1975లో విడుదలైన అడ్వంచర్ అండ్ థ్రిల్లర్ హాలీవుడ్ మూవీ జాస్‌తో పోల్చారు. ఎప్పుడైనా సరే థింక్స్ ఆఫ్ షార్క్స్ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. తాను చేసిన వ్యాఖ్యలు నిజమనేలా కంపెనీల లాభ నష్టాల డేటా స్క్రీన్ షాట్లను షేర్ చేశారు. వాటిల్లో 2022 ఆర్ధిక సంవత్సరంలో బోట్ కంపెనీ అధినేత అమన్ గుప్త రూ.79 కోట్ల లాభం గడించారు. కార్ దేకో కోఫౌండర్ అమిత్ జైన్ రూ. 246 కోట్లు లాస్ అయ్యారు. లెన్స్ కార్ట్ 102 కోట్లు, షాదీ. కామ్ రూ.27 కోట్లు, సుఘర్ కాస్మోటిక్స్ అధినేత వినీత్ సింగ్ రూ.75కోట్లు నష్టపోయారని ఆ స్క్రీన్ షాట్లను షేర్ చేయగా.. షార్క్ ట్యాంక్ ఇండియా షోని నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ప్రతిభావంతులైన ఎంట్రప్రెన్యూర్లను వెలుగులోకి తెస్తుంది’. కానీ నేను షార్క్‌ల గురించి ఆలోచించినప్పుడల్లా, 'జాస్' సినిమా, ఆ సినిమాలోని రక్త పాతం గుర్తుకు వస్తుందని అన్నారు. పక్షపాతంగా, అర్ధరహితంగా ఆ ట్వీట్‌పై షార్క్ ట్యాంక్ జడ్జ్ షాది.కామ్ ఫౌండర్, అనుపమ్ మిట్టల్ స్పందించారు. సార్ మీరు దానిని హాస్యాస్పదంగా చెప్పారని అనిపిస్తుంది. మీరు పక్షపాతంగా, అసంపూర్ణంగా ఉండే అంశాలపై ప్రతిస్పందించారని నేను భావిస్తున్నాను. కానీ మీలాగే..సొరచేపలు నష్టాల్ని కాకుండా లాభాల్ని తెచ్చిపెడుతున్నాయంటూ చమత్కరించారు. I enjoy #SharkTankIndia as a program and I think it is a great platform for our budding entrepreneurs. 1 But whenever I think of sharks, I think of the movie ‘Jaws’ and bleeding 🩸! pic.twitter.com/LAmGxQOiU8 — Harsh Goenka (@hvgoenka) January 22, 2023 I know you meant it in jest so with all due respect sir, I think u reacted to what appears to be superficial, biased & incomplete data. Happy to learn from stalwarts, but just to clarify, like u, the sharks 🦈 don’t bleed red, we bleed blue 🇮🇳 & that’s why we do what we do 🤗 — Anupam Mittal (@AnupamMittal) January 24, 2023 -
విశాఖపట్నం: భారీ సొర,కొమ్ము కోనాం చేపలు (ఫొటోలు)
-
వలలో పడ్డ రంపం చేప.. వామ్మో చూడాలంటేనే భయమేస్తోంది!
యశవంతపుర(బెంగళూరు): ఉడుపి మల్పె వద్ద అరేబియా సముద్రంలో అపురూపమైన చేప వలలో పడింది. సా ఫిష్ (రంపపు చేప)గా దీనిని పిలుస్తారు. 250 కేజీలున్న చేపను ఆదివారం జాలర్లు బోటులో తెచ్చి లారీలో మంగళూరుకు తరలించారు. చేప నోరు 10 అడుగుల పొడవైన రంపంలా ఉంది. దీనిని చూడడానికి స్థానికులు, పర్యటకులు బారులుతీరారు.ఈ జాతి చేపలు అంతరించే దశకు చేరుకున్నాయి. -
షార్క్ చేపతో ముఖాముఖి షూటింగ్: షాకింగ్ వైరల్ వీడియో!!
షార్క్ చేపలు ఎంత ప్రమాదకరమైనవో తెలిసిందే. అయితే ఈ షార్క్ చేపలను వీడియో తీసేటప్పుడూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. నిజానికి వాటికి తెలియకుండానే వీడియో తీస్తారు గానీ నేరుగా తీసే ధైర్యం మాత్రం చేయరు. అలాంటిది ఈ వ్యక్తి ఏకంగా షార్క్ చేపను నేరుగా కొన్ని నిమిషాల పాటు వీడియో తీశాడు. అసలు విషయంలోకెళ్లితే...డేవిడ్ షెర్రర్ అనే చేపల పట్టే వ్యక్తి నార్త్ కరోలినా సముద్రపు ఒడ్డున డైవింగ్ చేస్తూ ఒక అద్భుతమైన తెల్ల షార్క్ చేప ఫుటేజ్‌ని తీశాడు. అయితే అతను ఆ షార్క్ చేపను చాలా దగ్గర నుంచి(ముఖాముఖి) వీడియో తీశాడు. ఒకనొక దశలో ఆ చేప అతనికి దగ్గరగా సమీపించడమే కాక చేతిలో ఉన్న గన్ని చూసి తనను తాను రక్షించుకునే నిమిత్తం వెనుదిరుగుతుంది కూడా. ఎంతోమంది ఈ షార్క్ చేపలను వీడియో తీశారు గానీ ఇలా షార్క్ చేపకు అతి చేరువలో నేరుగా వీడియో చిత్రీకరించలేదు. అతని అదృష్టమో ఏమో గానీ అతనిపై మాత్రం దాడిచేయలేదు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింత తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా వీక్షించండి. -
వైరల్: వలలో పడ్డ భారీ షార్క్.. పడవ దగ్గరకు వచ్చి ఏం చేసిందంటే!
లండన్: యూకేకు చెందిన ఓ మత్స్యకారుడు అరుదైన రికార్డు బ్రేక్ చేశాడు. ఎలా అంటారా.. సముద్రంలో వేటకు వెళ్లిన అతను అనుకోకుండా ఓ భారీ షార్క్‌ను పట్టుకోగా ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే 1993లో ఓ మత్స్యకారుడికి 229 కిలోల షార్క్ దొరకగా ఇప్పటి వరకు ఆ రికార్డు అలానే ఉండిపోయింది. తాజాగా ఆ రికార్డు దీంతో బ్రేక్ అయింది. వివరాల్లోకి వెళితే.. నార్తాంప్టన్‌షైర్‌కు చెందిన సైమన్ డేవిడ్సన్ డెవోన్ తీరంలో ఎప్పటి లానే వేటకు వెళ్లాడు. కాకపోతే ఆ రోజు అతనికి అనూహ్యంగా 7 అడుగుల, 250 కిలోలు బరువున్న ఓ భారీ షార్క్ అతని వలలో పడింది. దీనిపై సైమన్ మాట్లాడుతూ.. తన ఎరకు ఏదో సాధారణ చేప చిక్కుకున్నట్లు అనుకున్నానని తెలిపాడు. ఒక గంటకు పైగా ఆ భారీ చేపతో కుస్తీ పడి, ఎలాగో చివరకు దాన్ని పడవలోకి లాగేశానన్నాడు. పడవలోకి లాగిన తర్వాత దాన్ని చూసి కంగారుపడినట్లు తెలిపాడు. అయితే కొంతసేపు అయ్యాక ఆ జీవిని మరో ఐదుగురితో కలిసి తిరిగి సముద్రంలో వదిలేశారు. సముద్రంలోకి వదిలే ముందు ఆ షార్క్ కొలతలు తీసుకున్నట్లు సైమన్ తెలిపాడు. చదవండి: మట్టి ముంతలో స్పెషల్ పిజ్జా.. నెటిజన్లకు నోరూరిస్తోంది -
అంతరించిపోతున్న జాబితాలోకి మరిన్ని జీవులు
పరి: ప్రపంచపటంపై అంతరించిపోతున్న జీవుల జాబితాలోకి మరిన్ని జీవులు చేరుతూనే ఉన్నాయి. 2014తో పోలిస్తే షార్క్‌లు, రే చేపల జనాభా మరింతగా కుంచించుకుపోయిందని తాజాగా విడుదలైన రెడ్లిస్టు చెబుతోంది. అంతర్జాతీయంగా ఉనికి ప్రమాదంలో పడిన జీవజాలం వివరాలను ఐయూసీఎన్(ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్) నమోదు చేస్తుంటుంది. తాజాగా కొమొడో డ్రాగన్ కూడా అంతరించే ప్రమాదం ఉన్న జీవుల జాబితాలోకి ఎక్కిందని ఐయూసీఎన్ తెలిపింది. పెరుగుతున్న సముద్రమట్టాలు, ఉష్ణోగ్రతలు పలు జీవజాతుల సహజ ఆవాసాలను ధ్వంసం చేస్తున్నాయని వివరించింది. చెట్ల విషయానికి వస్తే ఎబొని, రోజ్‌వుడ్ జాతుల చెట్లు అంతర్ధాన ముప్పును ఎదుర్కొంటున్నాయి. షార్క్, రే చేపల అంతరించే ముప్పు 2014లో 33 శాతం ఉండగా, 2021నాటికి 37 శాతానికి పెరిగిందని తెలిపింది. చేపలవేట, వాతావరణంలో మార్పులు ఇందుకు కారణమని, సముద్రషార్కుల జనాభా 1970తో పోలిస్తే ప్రస్తుతం 71 శాతం తగ్గిపోయిందని తెలిపింది. అయితే దేశాల మధ్య ఒప్పందాల కారణంగా ట్యూనా జాతి చేపల జనాభాలో పెరుగుదల కనిపించిందని ఐయూసీఎన్ డైరెక్టర్ బ్రూనో ఒబెర్లె చెప్పారు. సంస్థ పరిశీలిస్తున్న 1,38,000 జాతుల్లో దాదాపు 38వేల జాతులు అంతర్ధానమయ్యే ప్రమాదంలో ఉన్నాయి. పక్షుల్లో దాదాపు 18 జాతుల ఉనికి అత్యంత ప్రమాదకర అంచుల్లో ఉందని సంస్థ తెలిపింది. కరిగిపోతున్న మంచు తో 2100 నాటికి దాదాపు 98 శాతం ఎంపరర్ పెంగి్వన్లు నశించిపోయే ప్రమాదం ఉందంది. -
అమ్మో ఎంత పెద్ద షార్కో..
భువనేశ్వర్: సముద్రంలో ఉన్న షార్క్‌లను చూడటానికి ప్రతి ఒక్కరు తెగ ఆసక్తికనబరుస్తారు.. దీనికోసం సముద్రంలోనికి వెళ్ళడానికి కూడా ఆసక్తి చూపిస్తారు. అయితే ఈ షార్క్ మీకేందుకు శ్రమ ఇవ్వాలనుకుందో ఏమో తనే సముద్రం నుంచి ఒడ్డుకు కొట్టుకుని వచ్చేసింది. వివరాల్లోకి వెళ్తే.. భువనేశ్వర్‌లోని సునాపుర్ బీచ్ వద్ద 20 ఫీట్ల పొడవైన షార్క్ తీరానికి కొట్టుకుని వచ్చింది. ఇది మాములు షార్క్‌లకన్నా చాలా పెద్దది. మొదట మత్య్సకారులు చనిపోయి వచ్చిందేమోనని భావించారు. తీరా దగ్గరికి వెళ్ళిచూసేసరికి అది ప్రాణాలతోనే ఉంది. ఈ భారీ షార్క్‌ను చూడటానికి స్థానికులు, పర్యాటకులు పెద్దఎత్తున ఎగబడ్డారు. వెంటనే మత్స్యకారులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు షార్క్ బతికే ఉందని నిర్థారించుకుని, స్థానికుల సహకారంతో తిరిగి సముద్రంలోనికి వదిలివేశారు. అయితే, గతంలోను బాలసోర్, సునాపుర్ బీచ్‌ల వద్ద చనిపోయిన షార్క్‌లు తీరానికి కొట్టుకుని వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, తిమింగలాలను వైల్డ్‌లైఫ్ ప్రొటేక్షన్యాక్ట్ కింద అంతరించిపోతున్న జీవజాతుల జాబితా కింద సంరక్షిస్తున్నారు. చదవండి: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. కుప్పలుగా తల్లో పేలు! -
25 లక్షల షార్క్‌లను చంపాల్సిందేనా?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచం మొత్తం కరోనా వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. అయితే ఈ వ్యాక్సిన్ తయారీ కోసం లక్షల సంఖ్యలో షార్క్‌లు బలికావల్సి వస్తుందని షార్క్ పరిరక్షణ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే చర్మసౌందర్య ఉత్పత్తుల్లో, కొన్ని రకాల మాయిశ్చరైజర్లలో షార్క్ లివర్ ఆయిల్‌ను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ తయారీలో కూడా ఉత్తమ ఫలితాల కోసం షార్క్ లివర్ ఆయిల్ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయడుతున్నారు. ఈ ఆయిల్ ద్వారా దీర్ఘకాలిక రోగ నిరోధక శక్తి పొందవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 193 రకాల కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. వీటిలో ఐదు, ఆరు కంపెనీలు కరోనా వ్యాక్సిన్ తయారీలో షార్క్ ఆయిల్ ఉపయోగించాలని నిర్ణయించుకున్నాయి. ఇక బ్రిటన్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ను అందించడానికి 100 కోట్ల డోస్‌లు తయారు చేయాలని యోచిస్తోంది. ఇక ఒక్కొక్కరికి ఒక్కో డోస్ ఇచ్చిన ఇందుకోసం 25 లక్షల షార్క్‌లను చంపాల్సి ఉంటుంది. అదే ఒక్కొక్కరికి రెండు డోస్‌లు కావాల్సి వస్తే వీటి సంఖ్య రెట్టింపు అయ్యి 50 లక్షలకు పైనే ఉంటుంది. దీని గురించి షార్క్ పరిరక్షణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేస్తే షార్క్‌ల మనుగడకే ముప్పు వాటిల్లవచ్చని హెచ్చరిస్తున్నారు. షార్క్ ఆయిల్ బదులు షుగర్‌కేన్, గోధుమ, ఈస్ట్‌లు, బ్యాక్టీరియాలు వాడొచ్చని వారు సూచిస్తున్నారు. వీటిపై వ్యాక్సిన్ తయారీలో పాల్గొంటున్న నిపుణులు మాట్లాడుతూ, అన్ని రకాల వాటిని పరిశీలించిన తరువాతే షార్క్ ఆయిల్‌ను ఉపయోగిస్తామని, అంతకంటే వేరే దానితో చేస్తే వ్యాక్సిన్ మంచి ఫలితాలను ఇస్తుంటే వాటినే ఉపయోగిస్తామని పేర్కొన్నారు. చదవండి: వ్యాక్సిన్: యూఎస్ కంపెనీల కీలక ప్రకటన -
మెక్సికన్ గల్ఫ్‌లో అరుదైన షార్క్ చేప..
అమెరికాలోని గల్ఫ్ మెక్సికోలో ఓ కొత్త షార్క్ చేపను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కేవలం 5.5 అంగుళాలు మాత్రమే ఉండి చాలా ప్రకాశవంతంగా కనిపిస్తోంది. గత కొన్నెళ్లుగా షార్క్ చేపలపై, సముద్రాలలోని ప్లాస్టిక్‌పై అధ్యయనం చేస్తున్న తులనే విశ్వవిద్యాలయం పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 1979 అనంతరం తొలిసారి అతి చిన్న షార్క్ చేపను గుర్తించినట్టు తెలిపారు. గతంలో 2010, 2013లలో దీనిని గుర్తించామని కానీ తమకు చిక్కలేదన్నారు. ఈ షార్క్ చేప దాని శరీరం నుంచి వచ్చే కాంతితో ఎదుగుతుందని స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ తెలుపుతోంది. దీంతో పాటు ఇతర జీవులను ఆకర్షించడానికి, వీటిపై దాడి చేసేవారిని దూరంగా ఉండమని హెచ్చరిస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 2010 లో గల్ఫ్ ప్రాంతంలో తిమింగలాలపై అధ్యయనం చేస్తున్నప్పుడు శాస్త్రవేత్తలు కాంతిని ప్రసరించే మగ కైట్ఫిన్ షార్క్ కనుగొన్నారు. ఆ తర్వాత నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ పరిశోధకుడు మార్క్ గ్రేస్ కాంతితో మెరిసే షార్క్ చేపను కనుగొన్నారు. ఎక్కువగా లోతు ఉండే సముద్ర జీవులపై పరిశోధనలు చాలా తక్కువగా జరుగుతున్నాయంటూ.. సముద్ర పైభాగంలోని నీటిలో నివసించే జంతువుల్లో 90 శాతం కాంతిని ప్రసరిస్తాయని ఎన్ఓఏఏ అంచనా వేసింది. -
భారీ వర్షాలు రోడ్డుపై షార్క్, పాము
-
నడి రోడ్డుపై షార్క్, 5 అడుగుల పాము
మంగళూరు : మంగళూరు రోడ్లపై ప్రమాదకరమైన జంతువులు దర్శనమిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా కర్ణాటకలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వీధులు నీటితో నిండిపోయాయి. దీంతో జనావాసాలకు దూరంగా ఉండాల్సిన పాములు, షార్క్‌లు రోడ్డుపైకి వచ్చేస్తున్నాయి. వర్షాల కారణంగా అరేబియన్ సముద్రంలో భారీ అలలు ఎగసిపడటంతో సముద్రపు నీటితో పాటు ఆరు అడుగుల పొడవైన షార్క్ ఒకటి మంగళూరు వీధుల్లోకి వచ్చి పడింది. ఇది గమనించిన ఓ వ్యక్తి దాన్ని ఇనుప కొక్కెంతో రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లటంతో అది ప్రాణాలు విడిచింది. అంతేకాకుండా 5 అడుగుల పాము ఒకటి రోడ్డుపై నిల్వ ఉన్న నీటిలో అలా ఈదుకుంటూ వెళ్లటం అక్కడి వారిని కొంత భయానికి గురిచేసింది. పాము తమ పక్కనుంచి వెళ్లేంత వరకూ అలా చూస్తూ ఉండి పోయారు. విషపూరిత జంతువులు నీటిలో తిరుగుతుండటంతో జనాలు వీధుల్లో నిల్వ ఉన్న నీటిలోకి దిగి నడవటానికి భయపడతున్నారు. సముద్రంలో భారీ అలలు ఎగసి పడుతుండటంతో జాలర్లు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని ప్రభుత్వం హెచ్చరించింది. కర్నాటక బెళ్తంగడి తాలూకా మిత్తబాగిలులోని ఎర్మయ్ ఫాల్స్‌లో షూటింగ్ కోసం వెళ్లిన కన్నడ వర్ధమాన దర్శకుడు సంతోష్ శెట్టి అధిక వర్షాల కారణంగా నీటి ఉధృతిలో కోట్టుకొనిపోయి మరణించిన విషయం తెలిసిందే. -
హ్యామర్‌హెడ్ షార్క్చేపల వేట
-
తీవ్ర విషాదం: తీరానికి కొట్టుకొచ్చాయి..
పెర్త్ , ఆస్ట్రేలియా : వెస్టర్న్ ఆస్ట్రేలియాలోని హమెలిన్ సముద్ర తీరంలో పెను విషాదం చోటు చేసుకుంది. దాదాపు 150 వేల్స్ ఒడ్డుకు కొట్టుకువచ్చి ప్రాణాలు విడిచాయి. మృత్యువాత పడ్డ వేల్స్‌ను తినేందుకు షార్క్‌లు ఎగబడ్డాయి. ఈ ఘటనకు సంబంధించిన హృదయవిదారక దృశ్యాలను చిత్రీకరించిన స్థానికులు సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి. నది సముద్రం కలిసే చోట నీటికి ఎదురొచ్చిన వేల్స్ గుంపు ఇలా సముద్ర తీరానికి వచ్చి తిరిగి వెళ్లలేక ప్రాణాలు కోల్పోయాయని భావిస్తున్నారు. ఈ ఘటనపై డెయిలీ మెయిల్‌తో మాట్లాడిన స్థానిక మహిళ.. ఒడ్డుకు కొట్టుకొచ్చిన వందలాది వేల్స్లో తాను చూస్తుండగా మరణించాయని చెప్పారు. మరికొన్ని నీటిలోకి తిరిగి వెళ్లడానికి చేసిన ప్రయత్నాన్ని చూసి కంటతడి ఆగలేదని వెల్లడించారు. వాటికి సాయం చేయలేని తన నిస్సహాయతను ఆమె నిందించుకున్నారు. మరణించిన వేల్స్ మాంసం కోసం షార్క్‌లు తీరానికి వచ్చాయని చెప్పారు. తాము ఇచ్చిన సమాచారంతో బీచ్ వద్దకు చేరుకున్న రక్షకులు క్రేన్స్ సాయంతో కేవలం ఆరు వేల్స్‌ను మాత్రమే రక్షించగలిగారని వివరించారు. మిగిలిన వాటిని రక్షించేలోపే అవి ప్రాణాలు వదిలాయని తెలిపారు. ఒక్కో వేల్ నాలుగు టన్నులకు పైగా బరువుందని, అంత భారీ బరువున్న వాటిని సముద్రం లోపలికి(ఒక కిలోమీటర్ పాటు) తరలించడం రక్షకులకు కష్టసాధ్యమైందని అన్నారు. -
వైట్ షార్క్‌ల కోసం.. డైవర్ల సాహసం..!!
మెక్సికో సిటీ : పసిఫిక్ మహా సముద్రంలో డైవర్స్ సాహసం చేశారు. వైట్ షార్క్‌పై పరిశోధన కోసం బోనులో సముద్రం అడుగుకు వెళ్లారు. వారిని చూసిన షార్క్ ఒక్కసారిగా బోను వైపు దూసుకొచ్చింది. పలుమార్లు బోను చుట్టూ వేట కోసం తిరిగింది. ఇలా ఒక్క షార్క్ మాత్రమే కాదు.. మూడు రకాల వైట్ షార్క్స్‌పై డైవర్స్ పరిశోధనలు చేశారు. మెక్సికో సిటీకి కొద్దిదూరంలో గల గ్వాడాలుపే ద్వీపంలో కనిపించిన రెండు టన్నులు బరువున్న వైట్ షార్క్ మాత్రం భిన్నంగా ప్రవర్తించిందని పరిశోధకుల్లో ఒకరైన జాన్ చెప్పారు. బాగా లోతైన ప్రదేశాలకు వెళ్లి బోటు నుంచి కేజ్‌లను 40 అడుగుల లోతుకు దించినట్లు తెలిపారు. ఇలా మూడు రోజుల పాటు వైట్ షార్క్స్ కోసం అన్వేషణ కొనసాగినట్లు వివరించారు. 20 అడుగులు పొడవున్న ఓ ఆడ షార్క్ తనవైపునకు దూసుకొచ్చినట్లు చెప్పారు. ఈ సీజన్లో డైవర్స్ చేసిన పరిశోధనల్లో ఇదే అతిపెద్ద షార్క్ అని మాత్రం చెప్పగలనని అన్నారు. గ్రేట్ వైట్ షార్క్స్కు ప్రత్యర్థులపై మెరుపుదాడి చేసే శక్తి ఉంటుంది. కన్నుమూసి తెరచేలోగా లక్ష్యాన్ని అవి చేధిస్తాయి. సీల్స్ చేపలు అధికంగా ఉండే గ్వాడాలుపే ద్వీపంలో వైట్ షార్క్స్ అత్యధికంగా నివసిస్తున్నాయి. -
ముక్కలైన యుద్ధనౌక.. జవాన్లను కొరుక్కుతిన్న షార్క్స్
యుద్ధమంటే విజయమో.. వీర మరణమో అన్నమాట గుర్తొస్తోంది. రెండో ప్రపంచ యుద్ధంలో అణు ఆయుధ సామగ్రితో, భారీ దళాన్ని తీసుకుని బయల్దేరిన అమెరికా యుద్ధనౌక 'యూఎస్ఎస్ ఇండియానాపొలిస్'. ప్రత్యర్థి యుద్ధనౌక వదిలిన టార్పిడో దెబ్బకు కుదేలై నీట మునిగింది. అత్యంత శక్తిమంతమైన టార్పిడో కావడంతో యుద్ధనౌక భాగాలు ముక్కలయ్యాయి. వందలాది సైనికులు నీట మునిగారు. వారందరినీ బతికుండగానే షార్క్స్ కొరుక్కుని తినేశాయి. 1945 జులై 30న జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించిన వీడియో తమకు లభ్యమైనట్లు అమెరికా నేవీ పేర్కొంది. ఇండియానాపొలిస్ మునిగిపోయిన తర్వాత దాని శకలాలు అంతు చిక్కని మిస్టరీగా మారాయి. అయినా పట్టువిడవని అమెరికన్ నేవీ అప్పటి నుంచి ప్రయత్నాలు సాగిస్తూ.. పసిఫిక్ మహా సముద్రంలోని ఓ ప్రదేశంలో మూడున్నర మైళ్ల లోతులో యుద్ధనౌక శకలాలను గుర్తించింది. యుద్ధనౌక మునిగినా అందులో రికార్డింగ్ కోసం ఉంచిన వీడియో కెమెరా మాత్రం పని చేస్తూనే ఉంది. 1,200 మంది సైనికులు సముద్రంలో మునిపోగానే.. అక్కడ ఉండే షార్క్స్ ఒక్కసారిగా వారిపై దాడి చేసినట్లు వీడియోలో తెలుస్తోంది. బతికుండగానే వారి శరీరాలను షార్క్స్ చీలుస్తున్న దృశ్యాలు తమకు దొరికినట్లు అమెరికన్ నేవీ చెప్పింది. అయితే, పసిఫిక్ మహా సముద్రంలో కచ్చితంగా ఏ ప్రాంతంలో ఇండియానాపొలిస్ లభ్యమయ్యాయన్న విషయాన్ని మాత్రం నేవీ రహస్యంగా ఉంచింది. కాగా, ఈ దుర్ఘటన గురించి ప్రాణాలతో బయటపడిన ఓ నేవీ సైలర్ మాట్లాడుతూ.. అప్పటికే మరణించిన వారి రక్తం నీటిలో కలవడంతో షార్క్స్ కు పిచ్చెక్కినట్లు అయిందని చెప్పారు. పెద్ద షార్క్స్ గుంపు తమపై దాడి చేసిందని తెలిపారు. కళ్ల ముందే తన స్నేహితులను షార్క్స్ చంపేస్తున్నా వారిని కాపాడలేకపోయానని కంటతడి పెట్టుకున్నారు. సైనికులు ప్రాణాలు విడుస్తున్న వీడియో దొరకడం వారి కుటుంబ సభ్యులకు మళ్లీ బాధను కలుగుజేస్తుందని అన్నారు. -
గుట్టలు గుట్టలుగా చనిపోయిన షార్క్ లు!
సాధారణంగా షార్క్ లు సముద్రంలో షికారుకు వెళ్లిన వారిపై దాడులు చేయడం గురించి వింటుంటాం. వీటిలో కొన్ని రకాలు మాత్రం చాలా ప్రమాదకరమైనవి. కానీ మన దగ్గర మార్కెట్లలో చేపలు, రొయ్యలను ఎలాగైతో అమ్మకాలు జరుగుతుంటాయో అదే విధంగా కొన్ని దేశాల్లో షార్క్ లను విక్రయిస్తుంటారు. ఈ మధ్య వీటి దాడులు ఇండోనేషియాలో పెరిగిపోయాయి. ఇండోనేషియా వాసులు మాత్రం సముద్రంలో వేటకు వెళ్లి షార్కులను పట్టి వాటి తాట తీస్తుంటారు. ఈ ఫొటో చూస్తేనే అర్థమవుతోంది. వేలకొద్ది షార్క్ లను గుట్టలు గుట్టలుగా పడిఉండటం చూస్తే ఇది చిన్న తరహా వ్యవహరం కాదు. ప్రపంచంలోనే ఇండోనేషియా మార్కెట్ షార్క్ ఎగుమతులలో ప్రసిద్ది చెందింది. చైనా, హాంకాంగ్, తైవాన్, సింగపూర్ దేశాలకు నిత్యం వేలకొద్ది షార్క్ లను ఎగుమతి చేస్తుంటారు. షార్క్‌లతో ఖరీదైన సూప్ లు! ఇండోనేషియా, పశ్చిమ జావా ప్రాంతంలో రెండు రోజుల కిందట ఇంద్రమయూ మార్కెట్ లో ఈ దశ్యాలు కనిపించాయి. షార్క్ సూప్ చాలా బాగుంటుందని అక్కడి వారు చెబుతున్నారు. షార్క్ సూప్ ఒక్క బౌల్ దాదాపు రూ.600 ఉంటుంది. ముఖ్యంగా చైనా వాసులు ఈ సూప్ అంటే పడి చచ్చిపోతారట. ఖరీదైన సూప్ తాగటం వారి విలాసవంతమైన జీవనానికి, వారి ఆర్థిక స్థితిగతులకు అద్దం పడుతోంది. షార్క్ లను కొన్ని పద్దతుల్లో ఎండబెట్టి వాటిని కూడా ఇండోనేషియా నుంచి ఎగుమతి చేస్తుంటారు. డ్రై షార్క్ లు ఏడాదిలో కనీపం 486 టన్నులు ఎగుమతి అవుతుంటాయని అధికారులు తెలిపారు. కొందరు జంతు ప్రేమికులు షార్క్ ల వేటపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షార్క్ జాతులు అంతరించి పోతాయని వాదనలు వినిపిస్తున్నాయి.