సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచం మొత్తం కరోనా వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. అయితే ఈ వ్యాక్సిన్ తయారీ కోసం లక్షల సంఖ్యలో షార్క్‌లు బలికావల్సి వస్తుందని షార్క్ పరిరక్షణ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే చర్మసౌందర్య ఉత్పత్తుల్లో, కొన్ని రకాల మాయిశ్చరైజర్లలో షార్క్ లివర్ ఆయిల్‌ను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ తయారీలో కూడా ఉత్తమ ఫలితాల కోసం షార్క్ లివర్ ఆయిల్ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయడుతున్నారు. ఈ ఆయిల్ ద్వారా దీర్ఘకాలిక రోగ నిరోధక శక్తి పొందవచ్చని భావిస్తున్నారు.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 193 రకాల కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. వీటిలో ఐదు, ఆరు కంపెనీలు కరోనా వ్యాక్సిన్ తయారీలో షార్క్ ఆయిల్ ఉపయోగించాలని నిర్ణయించుకున్నాయి. ఇక బ్రిటన్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ను అందించడానికి 100 కోట్ల డోస్‌లు తయారు చేయాలని యోచిస్తోంది. ఇక ఒక్కొక్కరికి ఒక్కో డోస్ ఇచ్చిన ఇందుకోసం 25 లక్షల షార్క్‌లను చంపాల్సి ఉంటుంది.
అదే ఒక్కొక్కరికి రెండు డోస్‌లు కావాల్సి వస్తే వీటి సంఖ్య రెట్టింపు అయ్యి 50 లక్షలకు పైనే ఉంటుంది. దీని గురించి షార్క్ పరిరక్షణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేస్తే షార్క్‌ల మనుగడకే ముప్పు వాటిల్లవచ్చని హెచ్చరిస్తున్నారు. షార్క్ ఆయిల్ బదులు షుగర్‌కేన్, గోధుమ, ఈస్ట్‌లు, బ్యాక్టీరియాలు వాడొచ్చని వారు సూచిస్తున్నారు. వీటిపై వ్యాక్సిన్ తయారీలో పాల్గొంటున్న నిపుణులు మాట్లాడుతూ, అన్ని రకాల వాటిని పరిశీలించిన తరువాతే షార్క్ ఆయిల్‌ను ఉపయోగిస్తామని, అంతకంటే వేరే దానితో చేస్తే వ్యాక్సిన్ మంచి ఫలితాలను ఇస్తుంటే వాటినే ఉపయోగిస్తామని పేర్కొన్నారు. చదవండి: వ్యాక్సిన్: యూఎస్ కంపెనీల కీలక ప్రకటన
కరోనా వ్యాక్సిన్ తయారీకి షార్క్ లివర్ ఆయిల్!
Published Sat, Oct 17 2020 12:59 PM | Last Updated on Sat, Oct 17 2020 3:52 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment