వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షునిగా బాధత్యలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (donald trump) వరుస కఠిన నిర్ణయాలతో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే అక్రమ వలస దారుల్ని విమానాల ద్వారా దేశాల్ని దాటించేస్తున్నారు. వలసవచ్చిన వారికి అమెరికా గడ్డపై పుడితే వచ్చే జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేశారు. తాజాగా, అమెరికాలో ట్యాక్స్ వసూలు చేసే ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ ఏజెంట్లను విధుల నుంచి తొలగించనున్నట్లు తెలిపారు.
అమెరికాలో ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్(internal revenue service (irs) విభాగంలో సుమారు 90 వేల మంది ఏజెంట్లు విధులు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా ఆ విభాగానికి ప్రభుత్వ నిధుల కేటాయింపు తగ్గిస్తూ వస్తుంది.తాజాగా, అధికార పార్టీ నేతలు సైతం ఐఆర్‌ఎస్ విభాగాన్ని మూసివేయాలని ప్రతిపాదన తెచ్చారు.
ఈ తరుంలో ట్యాక్స్ వసూలు చేసే ఏజెంట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు ట్రంప్ ప్రకటించారు. జోబైడెన్ ప్రభుత్వం 88,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడమో.. లేదా నియమించుకొనేందుకు ప్రయత్నించడమో చేశాము. మేం వారిని తొలగించబోతున్నాం. లేదంటే సరిహద్దుల్లోకి పంపే ప్రక్రియలో ఉన్నట్లు ట్రంప్ చెప్పారు.
అమెరికా-మెక్సికో సరిహద్దులో అక్రమ వలసలను అరికట్టేందుకు ఐఆర్‌ఎస్ ఏజెంట్లు తుపాకీ పట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకు వారు అర్హులు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
కాగా,అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ .. మాజీ అధ్యక్షుడు జోబైడెన్ ప్రభుత్వం ఏటా 6.5 ట్రిలియన్ డాలర్లను దుబారా చేస్తోంది. ఈ దుబార తగ్గించి, అవినీతి అరికట్టేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(డోజ్) అనే సంస్థను ఏర్పాటు చేస్తున్నాం. వీటికి ఎలాన్ మస్క్ (elon musk), వివేక్ రామస్వామిలకు సంయుక్త బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. చెప్పినట్లుగానే అధికారంలోకి వచ్చిన మరుక్షణమే డోజ్ ఆధ్వర్యంలో వరుస నిర్ణయాలతో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు.
👉చదవండి : ట్రంప్ సంచలన నిర్ణయాలు.. ఖుషీలో ఇజ్రాయెల్, ఉక్రెయిన్!
Comments
Please login to add a commentAdd a comment