రష్యా కాల్పుల్లో ఉక్రెయిన్‌ నటుడి మృతి.. వైరలవుతోన్న చివరి పోస్టు.. | Ukrainian Actor Last Post Before Death While Fighting Against Russia | Sakshi
Sakshi News home page

వైరలవుతోన్న ఉక్రెయిన్‌ నటుడి చివరి పోస్టు..

Published Fri, Mar 11 2022 9:00 PM | Last Updated on Fri, Mar 11 2022 9:42 PM

Ukrainian Actor Last Post Before Death While Fighting Against Russia - Sakshi

రెండు వారాలు అవుతున్న ఉక్రెయిన్‌పై రష్యా విధ‍్వంసం ఆగడం లేదు. కోట్ల సంపద మట్టిలో కలిసిపోతుంది. లక్షలమంది పౌరులు దేశం విడిచి పక్క దేశాలకు శరనార్థులుగా వెళుతున్నారు. వేలాది మంది సైనికులు పోరాటంలో వీరమరణం పొందుతున్నారు. వందలాది మంది అమాయక ప్రజల ప్రాణాలు బాంబు దాడులకు బలైపోతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య నేపథ్యంలో తన దేశాన్ని రక్షించుకోవడానికి సాయుధ దళాలలో చేరిన ఉక్రెయిన్ యువనటుడు పాషా లీ (33) ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. 

జెలెన్‌స్కీ పిలుపుతో
దేశ పౌరులు సైన్యంలో చేరాలని, అవసరమైతే ఆయుధాలు కూడా ఇస్తామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చేసిన పిలుపుకు స్పందించిన పాషా లీ సైన్యంలో చేరారు. ఇర్ఫిన్ నగర శివారు ప్రాంతంలో ఉక్రెయిన్ సైనికులతో కలసి విధులు నిర్వహిస్తుండగా రష్యా దళాల కాల్పుల్లో యుద్ధభూమిలోనే తుదిశ్వాస విడిచారు. తాజాగా నటుడి ఇన్‌స్టాగ్రామ్‌ చివరి పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చనిపోవడానికి కొద్ది గంటల ముందు తన ఫోటోను పాషా లీ షేర్ చేశారు. 
చదవండి: ఉక్రెయిన్‌కు కోలుకోలేని దెబ్బ.. యుద్ధం ఆగినా కష్టమే! రష్యాపైనా భారం?

‘దేశాన్ని కాపాడుకునేందుకు నావంతు పోరాటం చేస్తున్నా.. గత 48గంటలుగా విధుల్లో ఉన్న నాకు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పేందుకు కూర్చొని ఓ ఫోటో తీసుకునే అవకాశం దొరికింది. మా దేశం కోసం పోరాడగలం, ఏమైనా చేయగలం.. అందుకే నవ్వుతున్నాం.. మేము పనిచేస్తున్నాం ’ అంటూ సైనిక దుస్తుల్లో దిగిన ఫోటో పోస్టు చేశారు.

టీవీ కమర్షియల్‌తో కెరీర్‌ ప్రారంభించి
ఉక్రెయిన్‌లో పాషా లీ ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు, పేరు తెచ్చుకున్నారు. టీవీ కమర్షియల్‌తో కెరీర్‌ ప్రారంభించిన పాషా లీ.. 2006లో ‘స్టోల్న్యా’ సినిమాతో హీరోగా తన కెరీర్‌ను ప్రారంభించాడు. ‘మీటింగ్స్ ఆఫ్ క్లాస్‌మేట్స్’, ‘షాడో ఆఫ్ ది అన్‌ఫర్‌గాటెన్ యాన్సిస్టర్’ వంటి సినిమాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి. మరోవైపు లీ.. గాయకుడిగా, మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. 
చదవండి: రష్యా దాడి: కుటుంబాన్ని కాపాడుకోవాలని ఎంతో చేశాడు.. చివరికి ఒక్కడే మిగిలాడు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement