కీవ్: ఉక్రెయిన్‌పై రష‍్యన్ బలగాలు విరుచుకుపడుతున్నాయి. 14 రోజులుగా జరుగుతున్న భీకర పోరులో ఇరు దేశాలకు చెందిన సైనికులు వేల సంఖ్యలో మృత్యువాతపడుతున్నారు. బాంబు దాడుల కారణంగా ఇటు ఉక్రెయిన్‌లోని సామాన్య పౌరులు సైతం మరణిస్తున్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్దం సందర్బంగా విషాదకర ఘటన చోటుచేసుకుంది. తమ దేశాన్ని శత్రు దేశం దాడుల నుంచి కాపాడే క్రమంలో ఉక్రేనియన్ నటుడు, గాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్ పాషా లీ(33) తన ప్రాణాలు కోల్పోయాడు.
అయితే, ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం ప్రారంభించాక పాషా లీ నటనను విడిచిపెట్టారు. ఉక్రెయిన్‌లోని టెరిటోరియల్ ఢిఫెన్స్ యూనిట్‌లో చేరి తమ దేశ సైన్యానికి కీలక సూచనలు, సలహాలు ఇస్తూ వారికి ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో మార్చి 6వ తేదీన రష్యా దాడుల్లో ఆయన మృతి చెందినట్టు ఒడెస్సా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించింది. కాగా, ఆయన మరణించారనే వార్త తెలియడంతో పాషా లీ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. దేశం కోసం ప్రాణాలు విడిచిన ధైర్యశీలి పాషా లీ అంటూ పోస్టులు చేస్తున్నారు.
ఉక్రెయిన్‌లో పాషా లీ ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు, పేరు తెచ్చుకున్నారు. టీవీ కమర్షియల్‌తో కెరీర్ ప్రారంభించిన పాషా లీ.. 2006లో ‘స్టోల్న్యా’ సినిమాతో హీరోగా తన కెరీర్‌ను ప్రారంభించాడు. ‘మీటింగ్స్ ఆఫ్ క్లాస్‌మేట్స్’, ‘షాడో ఆఫ్ ది అన్‌ఫర్‌గాటెన్ యాన్సిస్టర్’ వంటి సినిమాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి. మరోవైపు లీ.. గాయకుడిగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment