World Biggest Tree Saved By US Fire Fighters: గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ కాలుష్యం, మానవ తప్పిదాల వంటి కారణంగా మానువుడు ప్రకృతి ప్రకోపానికి గురి కావాల్సి వస్తుంది. మరోవైపు కరోనా మహమ్మారిలాంటి అతు చిక్కని రకరకాల వ్యాధులతో సతమవుతున్నాడు. ఈ తరుణంలో దేశాలకి పచ్చని బంగారంలాంటి పెద్ద పెద్ద కీకారణ్యాలు సైతం కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయి.
అడవులే లేకపోతే మానవుని మనుగడ కష్ట సాధ్యం. తన మనుగడ కోసం పోరాడాటనికీ అన్నిరకాలుగా సమయాత్తమవుతున్నాడు. అయినప్పటికీ ప్రకృతి తన కోపాన్ని ఉపశమించక కార్చిచ్చులతో అడవులను తనలో ఐక్యం చేసునేలా విరుచుకుపడుతోంది. ప్రస్తుతం అలాంటి ఘటన కాలిఫోర్నియా అడవుల్లో చోటు చేసుకుంది. కాలిఫోర్నియాలో భూమి తల్లి పెద్ద పెద్ద మహా వృక్షాలతో ఆకుపచ్చ చీరను ధరించనట్లుగా ఉండే గైయింట్ అడవులు ఉన్నాయి. ఈ అడవులను చూడటానికి ఏటా ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాదిమంది ప్రకృతి ప్రేమికులు సందర్శిస్తుంటారు. అలాంటి గైయింట్ అడవిలో గురువారం ఒక్కసారిగా కార్చిచ్చు రగిలి వేల ఏళ్ల నాటి మహా వృక్షాలను సైతం కబళించబోయింది.
(చదవండి: వెదురు విస్తీర్ణంలో భారత్ రెండో ప్లేస్, కానీ.. ఆ చిన్నదేశాల కంటే కిందనే!)
యూఎస్‌లోని అగ్నిమాపక సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమై ఆ విధ్వంసాన్ని ఆపారు. వందలాంది మంది అగ్నిమాపకు సిబ్బంది సుమారు మూడువేల ఏళ్ల నాటి మహా వృక్షాలను తమ సర్వసక్తులు ఒడ్డి కాపాడారని యూఎస్ అగ్నిమాపక శాఖ కమ్యూనికేషన్ ఆఫీసర్ గారెట్ వెల్లడించారు. ఈ సందర్భంగా గారెట్ మాట్లాడుతూ...." మా వద్ద వందలాదిమంది అగ్నిమాపకు సిబ్బంది ఉన్నారు. తాము ఏఎఫ్‌పీ అనే ఆపరేషన్ చేపట్టి అతి పెద్ద వృక్షాలతో కూడిన నేషనల్ పార్క్‌లను, వేల ఎకరాల అడవులను కార్చిచ్చుల నుంచి రక్షిస్తున్నాం. అంతేకాదు ఈ గైయింట్ అడవిలోని మహా వృక్షాలు సాధారణంగా కార్చిచ్చుకి అంత సులభంగా తగలబడవు. కానీ ఈ కార్చిచ్చు అతి పెద్దది దీన్ని ఎదుర్కోవడం తమ సిబ్బందికి సవాలుగా మారింది" అని చెప్పారు.
గైయింట్ అడవిలో దాదాపు రెండు వేల ఏళ్ల నాటి మహా వృక్షాలు ఉన్నాయని అందులో ఒక ఐదు వృక్షాలు సుమారు 3 వేల ఏళ్ల క్రితం నాటివని తెలిపారు. ఇవి ప్రపంచంలోనే అతి పెద్ద వృక్షాలు అంతేకాదు వీటి పొడవు 83 మీటర్లు (275 అడుగులు) ఉంటుందన్నారు. గత 25 ఏళ్లలో సంభవించిన అగ్ని ప్రమాదాల కంటే ఈ ఏడాది నుంచి మాత్రమే భయకరమైన అగ్నిప్రమాదాలు అడవుల్లో సంభవించి వేల ఎకారాల అడవులు నాశనమవుతున్నాయంటూ..గారెట్ ఆవేదన వ్యక్తం చేశారు.
(చదవండి: 1990లలో తీసిన క్యాడ్‌బరీ యాడ్ గుర్తుందా? అది ఇప్పుడు రివర్స్‌గా..)
Comments
Please login to add a commentAdd a comment