న్యూఢిల్లీ: ఒక్కొసారి చాలా అరుదైన ఘటనలు జరుగుతుంటాయి. ఇంతవరకు బాత్రుంలో మహిళ ప్రసవించడం (లేదా) విమానంలో ఒక మహిళకు నొప్పులు తీవ్రమైతే వెంటనే సమీపంలోని విమానాశ్రయంలో ఆపడం తదితర ఘటనలు గురించి విన్నాం. అయితే అచ్చం అలానే యూఎస్ మహిళ కారులో ప్రయాణిస్తున్నప్పుడూ నొప్పులు మొదలవుతాయి. అయితే అత్యధునిక టెక్నాలజీ కలిగిన టెస్లా కారు సాయంతో ఏ మాత్రం ఇబ్బంది లేకుండా బిడ్డకు జన్మనిచ్చింది.
(చదవండి: ‘ఆ రోజు చేసిన పని నన్ను పదే పదే కలచివేసింది')
అసలు విషయంలోకెళ్లితే...అమెరికాలోని యిరాన్ షెర్రీ (33) నిండు గర్భిణీ. ఒక రోజు ఆమె తన భర్త కీటింగ్ షెర్రీ (34) తో కలిసి తమ మూడేళ్లు కొడుకును ఫ్రీ స్కూలుకి తీసుకువెళ్లే నిమిత్తం టెస్లా కారులో పయనమయ్యారు. అయితే యిరాన్ షెర్రీ (33)కి అనుకోకుండా నొప్పులు రాగా, దీంతో ఆ దంపతులు వెంటనే సమీపంలో ఆసుపత్రికి వెళ్లడానికి ప్రయత్నించగా, విపరీతమైన ట్రాఫిక్ కారణంగా ఆస్పత్రికి చేరుకోవడం కష్టమైంది.
దీంతో ఆమె భర్త కీటింగ్ షెర్రీ కారుని ఆటో పైలెట్ మోడ్‌లో పెట్టి(అంటే కారుదానంతట అదే డ్రైవ్ చేసుకుంటూ వెళ్లుతుంది) ఆస్పత్రికి తీసుకువెళ్లమని ఆర్డర్ చేస్తాడు. అంతే కారు జీపీఎస్ నేవిగేషన సిస్టమ్ ఆసుపత్రికి వెళ్లడానికి ఇంకా 20 నిమిషాలు పడుతుందని చెబుతుంది. దీంతో అతను ఒక చేయిని స్టీరింగ్ పై వేసి మరో చేత్తో భార్యను ఓదారుస్తాడు. మరోవైపు ట్రాఫిక్ కారణంగా కారు వేగంగా వెళ్లే అవకాశం లేదు.
ఆ పరిస్థితుల్లో ఆమె కారు ఫ్రంట్ సీట్లో బిడ్డకు జన్మనిచ్చింది. అలా టెస్లా కారు ఆటో పైలట్ మోడ్‌లో ఉండగా పుట్టిన తొలి పాపగా ఆ బిడ్డ రికార్డ్ సృష్టించింది. దీన్ని అధికారికంగా గుర్తించారు. అయితే కారు ఆస్పత్రికి చేరేటప్పటికే బిడ్డ పుట్టేసింది. అంతేకాదు కారులోనే బిడ్డ నుంచి తల్లి పేగును కట్ చేశారు డాక్టర్లు. ఈ మేరకు తల్లి, బిడ్డా క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. అంతేకాదు ఆ దంపతులు కూడా ఆ పాపకు టెస్లా అని పేరు పెట్లాలని భావించారు కాని నిర్ణయం మార్చుకొని మాయెవ్ లిలీ అని పెట్టారు. ఈ అత్యధునిక టెక్నాలజీ కారణంగానే తన భార్యకు సురక్షితంగా ప్రసవం అయ్యిందని ఆటోపైలట్ మోడ్ అనే సాంకేతికతను అభివృద్ధి చేసి ఇచ్చినందుకు టెస్లా కార్ల ఇంజినీర్లకు సదరు మహిళ భర్త కీటింగ్ షెర్రీ ధన్యవాదాలు తెలిపారు.
(చదవండి: రాయ్ తుపాను ధాటికి 208 మంది మృతి)
Comments
Please login to add a commentAdd a comment