ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ సరికొత్త రికార్డ్‌లను నమోదు చేస్తున్నారు. ప్రపంచ దేశాల్లోని ఆటోమొబైల్ ఇండస్ట్రీని చిప్ కొరత వేధిస్తున్నా..ఎలన్ మస్క్ మాత్రం టెస్లాకార్ల అమ్మకాల జోరును పెంచుతున్నారు. బ్లూమ్‌బెర్గ్ 4వ వార్షిక నివేదికను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం.. క్యూ4 (అక్టోబర్,నవంబర్,డిసెంబర్)లో వరల్డ్ వైడ్‌గా 308,600 కార్లు అమ్ముడయ్యాయి. దీంతో టెస్లా వన్ ట్రిలియన్ మార్కెట్ వ్యాల్యూ కంపెనీల జాబితాలో చేరింది
ఊహించిన దానికంటే ఎక్కువే
2021లో టెస్లా సంస్థ ఊహించిన దానికంటే ఎక్కువగానే అమ్ముడైనట్లు బ్లూంబెర్గ్ తెలిపింది. ఇటీవల విడుదల చేసిన రిపోర్ట్‌లో 2021లో సంవత్సరం 87శాతం వృద్దితో మొత్తం టెస్లా 936,000 కార్ల అమ్మకాలు జరిపింది. బ్లూమ్‌బెర్గ్ సర్వే చేసిన 13 మంది అనలిస్ట్‌లు క్యూ4 లో టెస్లా సంస్థ సగటున 263,000 వాహనాలను డెలివరీ చేసినట్లు అంచనా వేశారు.
చెప్పిందే చేస్తున్నారు.
టెస్లా అధినేత ఎలన్ మస్క్ మల్టీ ఇయర్ పిరియడ్ (రెండు లేదా మూడు సంవత్సరాలు)మొత్తం కాలంలో కార్ల డెలివరీ 50 శాతం వార్షిక పెరుగుదలను ఆశిస్తున్నట్లు తెలిపారు. వరల్డ్ వైడ్‌గా సెమీకండక్టర్ తిరోగమనం మధ్య వరుసగా ఏడవ త్రైమాసికంలో టెస్లాకు లాభాల్ని తెచ్చిపెట్టింది. ఎలన్ మస్క్ ప్రతి త్రైమాసికంలో టెస్లా కార్ల డెలివరీలను పెంచుతూనే ఉన్నప్పటికీ, 2021లో సప్లయ్ చైన్ అంశాన్ని ఓ పీడకలగా అభివర్ణించారు. ఇక ఇతర ప్రయోజనాల కోసం చిప్‌లను ఉపయోగించేలా సాఫ్ట్‌వేర్‌లను తయారు చేయడంలో టెస్లా ఇంజినీర్లు ప్రయత్నాలు చేయడంతో ఇతర వాహన తయారీదారుల కంటే టెస్లా కంపెనీ మెరుగైన ఫలితాల్ని రాబడుతోంది.
టెస్లాకు తిరుగులేదని
టెస్లా కార్లలో ఆటో పైలెట్ ఫీచర్‌పై వివాదాలు, రియర్ వ్యూ కెమెరా, ట్రంక్‌లో సాంకేతిక లోపాలు, టెస్లా కారు రిపేర్‌కి లక్షల ఖర్చు అవుతుందని ఆ కారు ఆనవాళ్లు లేకుండా 30 కేజీల డైనమెట్‌తో బ్లాస్ట్ చేశారని వార్తలు అంతర్జాతీయ మీడియా సంస్థలు పతాక స్థాయిలో టెస్లా వైఫల్యం గురించి కథనాల్ని ప్రచురించినా ఆ కార్ల హవా తగ్గడం లేదు సరికాదా రోజు రోజుకీ ఆ కార్ల అమ్మకాలు పెరగడంతో ఎలక్ట్రిక్ కార్లలో టెస్లాకు తిరుగులేదని ఎలన్ మస్క్ మరోసారి నిరూపించినట్లైంది.
చదవండి: పాపం ఎలన్ మస్క్..! తినడానికి తిండి లేక, కడుపు నింపుకునేందుకు ఏం చేసేవాడో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment