వాషింగ్టన్: తొలిసారిగా అమెరికా శ్వేతసౌధంలో అంగరంగ వైభవంగా దీపావళి రిసెప్షన్ వేడుకలు నిర్వహించారు. చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా వైట్ హౌస్‌లో అత్యధిక సంఖ్యలో ఆసియా అమెరికన్లు ఉండటం విశేషం. అదీగాక బైడెన్ పరిపాలనో అధిక సంఖ్యలో భారతీయ అమెరికన్లు ఉన్నారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ...మీకు ఆతిథ్యం ఇవ్వడం మాకు గౌరవంగా ఉంది. వైట్‌హౌస్‌లో ఈ స్థాయిలో దీపావళి రిసెప్షన్‌ని నిర్వహించడం ఇదే తొలిసారి.
ఈ దీపావళి వేడుకను ఆమెరికా సంస్కృతిలో భాగం చేసినందుకు ధన్యవాదాలు. హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్ధులకు దీపావళి శుభాకాంక్షలు. దీపావళి వేడుకను ఆనందంగా జరుపుకున్నందుకు యూఎస్‌లోని ఆసియా అమెరికన్ కమ్యునిటీకి బైడెన్ కృతజ్ఞతలు చెప్పారు. అంతేకాదు ఈ పండుగ సందర్భంగా దియాలను వెలిగించడం సంతోషంగా ఉంది. ఈ కరోనా మహమ్మారి నుంచి బయటపడేల ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచేలా అమెరికా అంతటా ఉన్న దక్షిణాసియా అమెరికన్లు కనబర్చిన తెగువ, సాహసాలకు కృతజ్ఞతలు.
ఈ దీపావళి వేడుక చీకటిపై వెలుగు సాధించిన గుర్తుగా ఈ పండుగను జరుపకుంటున్నాం. అలాగే ఈ వేడుకతో అమెరికాతోపాటు ప్రపంచమంతా జ్ఞాన కాంతుల వెలుగుతో నింపుదాం అని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో వైస్ ప్రెసిడెంట్ కమలాహారిస్ మాట్లాడుతూ.. ఈ వైట్‌హౌస్ ప్రజల ఇల్లు, మా అధ్యక్షుడు, ప్రథమ మహిళ జిల్ బైడెన్‌తో కలిసి ఈ సంప్రదాయ వేడకను జరుపకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. అలాగే జిల్ బైడెన్ కూడా ఆసియా అమెరికన్ కమ్యూనిటీ మరింత ముందుకు వెళ్లేందుకు ఈ దీపావళి పండుగ సహకరిస్తోంది. అందర్నీ ఒకచోటకు చేర్చి సమానత్వాన్ని గుర్తు చేసేలా చేసుకునే పండుగ అని కొనియాడారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
#WATCH | US President Joe Biden, First lady Jill Biden and Vice-President Kamala Harris celebrate the festival of #Diwali at the White House pic.twitter.com/WPOOYSW2zo
— ANI (@ANI) October 24, 2022
(చదవండి: విమానంలో చిన్ననాటి టీచర్ చూసి...పట్టరాని ఆనందంలో ఫ్లైట్ అటెండెంట్...)
Comments
Please login to add a commentAdd a comment