
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆయన ఏం చేసినా, ఏం మాట్లాడినా సంచలనే అవుతుంది. కాగా, ట్రంప్‌పై ఓ రచయిత్రి.. లైంగిక దాడి ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ట్రంప్‌పై రేప్ కేసు నమోదు చేసేందుకు రచయిత్రి జీన్ కారోల్ సిద్దమైంది.
వివరాల ప్రకారం.. రచయిత్రి ఈ. జీన్ కారోల్ 1996లో బెర్గడోర్ఫ్ గుడ్‌మ్యాన్ స్టోర్‌లో పనిచేస్తున్న సమయంలో డోనాల్డ్ ట్రంప్ తనపై లైంగిక దాడి చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రంప్ లైంగిక దాడి చేసిన కారణంగా తాను మానసిక క్షోభను అనుభవించానని.. అందుకే కోర్టులో దావా వేయాలని భావిస్తున్నట్లు బాధితురాలు చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆమె తరఫు న్యాయవాది రాబర్టా కప్లాన్.. నవంబర్ 24న ట్రంప్‌పై దావా వేయనున్నట్టు స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, కారోల్ ఆరోపణలపై మాజీ అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ స్సందించారు. కారోల్ రాసిన పుస్తకాన్ని విక్రయించడానికి తనపై ఇలాంటి తప్పుడు కామెంట్స్ చేస్తున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment