జగిత్యాలక్రైం: ‘బిడ్డా పదేండ్ల తర్వాత వస్తిని.. మన కుటుంబాన్ని జూసి మురిసిపోతిని.. నీళ్లకోసం వెళ్లి కానరానికి లోకానికి పోతవనుకోలే బిడ్డా’ అని ఆ తండ్రి ఏడుస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. స్థానిక మహాలక్ష్మీనగర్‌కు చెందిన చౌటపల్లి శివకార్తీక్(12) మినరల్ వా టర్ కోసం తన ఇంటికి సుమారు 300 మీటర్ల దూరంలోని ప్లాంట్‌కు స్కూటీపై బయలు దేరా డు. మార్గమధ్యంలోని దేవిశ్రీ గార్డెన్ సమీప బైపాస్‌రోడ్డులో స్కూటీ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని పడిపోయాడు. తీవ్రగాయాలు కావడంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిన ట్లు నిర్ధారించారు. మోహన్ – పద్మ దంపతులు.
వీరికి కూతురు వర్ష, కుమారుడు శివకార్తీ క్. మోహన్ పదేళ్ల క్రితం సౌదీ అరేబియా వెళ్లి.. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ వచ్చా డు. కుటుంబ సభ్యులు అక్కడకు వెళ్లి జగిత్యాలలోని ఇంటికి తీసుకొచ్చారు. రోజంతా అందరూ సంతోషంగా గడిపారు. అయితే, మినరల్ వాటర్ కోసం శివకార్తీక్ రాత్రి వేళ స్కూ టీపై ప్లాంట్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగి చనిపోయాడు. తాను వచ్చినరోజే కొడుకు మృతిచెందడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment