
జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం
జగిత్యాలక్రైం: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం పనులు తుదిదశకు చేరాయి. వచ్చే నెల మూడో తేదీన మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభించేందుకు పోలీస్ అధికారులు సిద్ధం చేస్తున్నారు. మిగిలిన ఉన్న పనులు పోలీస్ హౌసింగ్‌బోర్డు పర్యవేక్షణలో యుద్ధప్రతిపాదికన కొనసాగుతున్నాయి.
20.25 ఎకరాల్లో నిర్మాణం
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సత్వర సేవలందించాలనే ఉద్దేశంతో 11 అక్టోబర్ 2016న కొత్త జిల్లాలను ప్రారంభించిన విషయం తెల్సిందే. అన్ని జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలను అందుబాటులోకి తెచ్చింది. కొత్తగా కలెక్టరేట్, జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. జగిత్యాల ధరూర్ క్యాంప్‌లో 20.25 ఎకరాల్లో ఎస్పీ కార్యాలయాన్ని చేపట్టారు. 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ క్ర మంలో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించేందు కు అక్టోబర్ 3న జిల్లాకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రానున్న నేపథ్యంలో అదే రోజు ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేశారు.
ముమ్మరంగా కొనసాగుతున్న పనులు
జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్‌లో నిర్మిస్తున్న నూతన జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం పనులు 10నెలలుగా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దీంతో ఇప్పటికే పోలీసు ప్రధాన కార్యాలయ పనులు 90 శాతం పూర్తి కాగా, మిగతా పనులకు కూడా యుద్ధప్రతిపాదికన చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ కార్యాలయం రంగులతోపాటు, ముందున్న మైదానాన్ని చదును చేశారు. ప్రధాన ద్వారాన్ని సిద్ధం చేశారు. పోలీసు ప్రధాన కార్యాలయం ఆవరణలో ఉన్న ఏఆర్ కార్యాలయంతోపాటు, ఎస్పీ క్యాంప్ కార్యాలయం పనులు కూడా పూర్తి చేశారు. ఫర్నీచర్ వస్తే కార్యాలయాల్లో సిద్ధం చేయనున్నారు.
వచ్చేనెల 3న మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభం
పనులు పర్యవేక్షిస్తున్న పోలీసు హౌసింగ్ కార్పొరేషన్
ప్రారంభానికి సిద్ధం
జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం పనులు పూర్తిగా పోలీసు హౌసింగ్‌బోర్డు పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. పనులు దాదాపు పూర్తికావచ్చాయి. అక్టోబర్ 3న మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభించేలా పనులు కొనసాగిస్తున్నాం.
– ఎగ్గడి భాస్కర్, ఎస్పీ

Comments
Please login to add a commentAdd a comment