
రాష్ట్రస్థాయి పోలీస్ మీట్‌లో సత్తా
కరీంనగర్ స్పోర్ట్స్: కళ్లు చెదిరే బాడీ బిల్డింగ్ ఫీట్లు.. మైమరిపించిన ఫుట్‌బాల్ కిక్‌లు.. ఆకాశన్నంటేలా జిమ్నాస్టిక్స్ విన్యాసాలు.. ప్రో కబడ్డీని సైతం మరిపించిన కబడ్డీ టాకిల్‌లు.. ఉడుం పట్టులా రెజ్లింగ్, జూడో, ఖోఖో, విలువిద్య పోటీలు, అబ్బురపరిచే యోగాసనాలు.. కరీంనగర్ వేదికగా 4 రోజులు నిర్వహించిన తెలంగాణ రాష్ట్రస్థాయి మూడో పోలీస్ మీట్–2025లో పలువురు క్రీడాకారులు అద్భుత ప్రదర్శన ఇచ్చారు. రాష్ట్రస్థాయి పోటీల్లో విజయం సాధించాం.. ఇక మా ముందున్న లక్ష్యం ఆలిండియా పోలీస్ మీట్.. అందులో పతకాల పంట పండిస్తామన్నారు.
● పతకాలు గెలుచుకున్న పలువురు క్రీడాకారులు
● నేషనల్స్‌లోనూ రాణిస్తామని ధీమా
ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తా
కరీంనగర్‌లో నిర్వహించిన కబడ్డీ, ఆర్మ్ రెజ్లింగ్ పోటీల్లో బంగారు పతకాలు, పవర్ లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించాను. ఆలిండియా పోటీల్లో బంగారు పతకం సాధించడమే లక్ష్యం. ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తా.
– బి సరిత, వనస్థలిపురం ట్రాఫిక్ స్టేషన్,
రాచకొండ కమిషనరేట్
ఇది నాకు ఫస్ట్ స్టేట్ మీట్
పోలీస్ జాబ్ కొట్టిన తర్వాత నేను పాల్గొన్న ఫస్ట్ స్టేట్ మీట్ ఇది. స్విమ్మింగ్‌లో 2 బంగారు పతకాలు సాధించాను. గతంలో 15 సార్లు జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొన్నాను. ఆలిండియా పోలీస్ మీట్‌లో పతకం సాధిస్తా.
– డి.శ్రీకల్యాణ్, కానిస్టేబుల్, టీజీఎస్పీ–5
8 పతకాలు సాధించాను
జిమ్నాస్టిక్స్‌లో 4 బంగారు, 1 రజత, యోగాలో 1 బంగారు, అర్చరీలో 2 కాంస్య పతకాలు సాధించాను. ఫస్ట్, సెకండ్ మీట్‌లోనూ పతకాలు గెలిచాను. ఆలిండియా స్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించడమే నా లక్ష్యం.
– ఎం.ఉదయ్‌కిరణ్, కానిస్టేబుల్, పెద్దపల్లి
బ్యాడ్మింటన్ డబుల్స్‌లో పసిడి
కరీంనగర్‌లో పోలీస్ మీట్ చాలా బాగా జరిగింది. మేము బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో బంగారు పతకం సాధించాం. నేను(షబానా సుల్తానా) సింగిల్స్‌లో కాంస్య పతకం గెలిచాను. ఆలిండియా పోటీలకు ప్రాక్టీస్ చేస్తాం.
– షబానా సుల్తానా, కిరణ్‌కుమార్, మినిస్టీరియల్ జోన్

రాష్ట్రస్థాయి పోలీస్ మీట్‌లో సత్తా

రాష్ట్రస్థాయి పోలీస్ మీట్‌లో సత్తా

రాష్ట్రస్థాయి పోలీస్ మీట్‌లో సత్తా

రాష్ట్రస్థాయి పోలీస్ మీట్‌లో సత్తా
Comments
Please login to add a commentAdd a comment