ఎస్సైపై ఎస్పీకి ఫిర్యాదు
జగిత్యాలక్రైం: గొల్లపల్లి మండలంలోని జగదేవ్‌పేటకు చెందిన నూకల భూలక్ష్మి వెల్గటూర్ ఎస్సై పై సోమవారం ఎస్పీ అశోక్‌కుమార్‌కు ఫిర్యా దు చేసింది. జగదేవ్‌పేట శివారులోని తన భూమి లో పంట సాగు చేసుకోగా అదే గ్రామానికి చెందిన కొందరు రాత్రివేళలో వెళ్లి, ధ్వంసం చేశారని తెలిపి ంది. ఈ విషయమై తాను ఫిర్యాదు చేసినా ఎస్సై కేసు నమోదు చేయకుండా పంట ధ్వంసం చేసిన వారికే వత్తాసు పలుకుతున్నారని ఆరోపించింది.
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
జగిత్యాల క్రైం: వ్యభిచారం నిర్వహిస్తున్న జగిత్యాల భవానీనగర్‌లోని ఓ ఇంటిపై పట్టణ పోలీసులు సోమవారం రాత్రి దాడి చేశారు. వారి వివరాల ప్రకారం.. జగిత్యాలకు చెందిన ఓ వ్యక్తి పెద్ద మొత్తంలో డబ్బులు ఆశచూపి, వివిధ ప్రాంతాల నుంచి మహిళలను తీసుకువచ్చి, వ్యభిచారం చేయిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు. అక్కడున్న మహిళలు, విటులను అదుపులోకి తీసుకొని, వారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
వేములవాడ అర్బన్: వే ములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్ మూ లవాగు బ్రిడ్జి కింద సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. మృతుడి వయసు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని, లైట్ బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్, బ్లాక్ టీషర్ట్ ధరించాడని పేర్కొన్నారు. గుర్తు పట్టినవారు సీఐ వీరప్రసాద్ 87126 56413, ఎస్సై రమేశ్ 87125 80413 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
టీచర్‌పై పోక్సో కేసు.. అరెస్టు
కోనరావుపేట(వేములవాడ): ఓ టీచర్‌పై పోక్సో కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్లు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. కోనరావుపేట మండలంలోని నిజామాబాద్ ఉన్నత పాఠశాలలో మూడు రోజుల క్రితం పోలీస్ అక్క కార్యక్రమంలో భాగంగా ఓ మహిళా కానిస్టేబుల్ మహిళా చట్టాలు, షీ టీమ్ విధులపై అవగాహన కల్పించారు. ఆ సమయంలో కొందరు విద్యార్థినులు కనపర్తి బ్రహ్మం అనే టీచర్ కొన్ని రోజులుగా క్లాస్‌రూమ్‌లో తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పారు. అతనిపై పోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు అనంతరం సోమవారం అరెస్ట చేసి, రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.
యువకుడి దుర్మరణం
చొప్పదండి: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. ఎస్సై అనూష కథనం ప్రకారం.. చొప్పదండి మండలంలోని రాగంపేటకు చెందిన ఒడ్నాల రమేశ్(28) చొప్పదండిలోని ఓ ఉడిపి హోటల్‌లో పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి పని ముగించుకొని హోటల్ ఎదుట నిలబడగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతని తలకు బలమైన గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి బాబాయి ఇరుకుల్ల శంకరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment