శివరాత్రికి ఆలయాలు ముస్తాబు
● రేపు మహాశివరాత్రి
ధర్మపురి: మహా శివరాత్రికి శివాలయాలను ముస్తాబు చేశారు. ధర్మపురిలోని శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధం శ్రీరామలింగేశ్వరస్వామి, అక్కపెల్లి శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంతోపాటు మండలంలోని నేరెల్ల సాంబశివ దేవాలయాలను రంగులు, విద్యుత్‌దీపాలతో అలంకరించారు. బుధవారం మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి రాత్రివరకు పంచోపనిషత్తులతో అభిషేకాలు, రుద్రహోమాలు నిర్వహిస్తారు. రామలింగేశ్వర స్వామి ఆలయంలో బుధవారం అర్ధరాత్రి లింగోద్భవం ఉంటుంది. అక్కపెల్లి రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆలయ చైర్మన్ సీపతి సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలతోపాటు సాయంత్రం శివ పార్వతుల కల్యాణ వేడుకలు నిర్వహిస్తారు. భక్తుల దర్శనాల కోసం ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అక్కపెల్లి రాజరాజేశ్వర ఆలయానికి ఉచిత వాహన సౌకర్యం కల్పించారు.
శివరాత్రికి ఆలయాలు ముస్తాబు
Comments
Please login to add a commentAdd a comment