ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్‌కు ఉరితాడు
జగిత్యాలటౌన్: ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్‌కు ఉరి తాడు కాబోతున్నాయని, బీసీల గెలుపును ఎవరూ ఆపలేరని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం జగి త్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దొంగ నోట్లతో దొంగ ఓట్లు కొనాలనుకునే వారిని బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ బిడ్డలను గెలిపిస్తే రానున్న ఎన్నికల్లో సీఎం కుర్చీ బీసీలదేనని పేర్కొన్నారు. బీసీ బిడ్డ ప్రసన్న హరికృష్ణకు టికెట్ ఇస్తే కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద నడకయ్యేదన్నారు. ఆ పార్టీ అభ్యర్థి నరేందర్‌రెడ్డి ఏరోజు కాంగ్రెస్ కోసం పనిచేశారో చెప్పాలన్నారు. బీసీల ఓట్లతో గద్దెనెక్కి మో సం చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి సామాజిక న్యాయం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 34 సీట్లు ఇస్తామన్న కాంగ్రెస్ 19 మాత్రమే ఇచ్చిందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు ఇస్తామని చెప్పి, 3కే పరి మితం చేసిందని మండిపడ్డారు. మంత్రి వర్గంలో నూ బీసీలకు ద్రోహం చేశారన్నారు. బీసీ కులగణన అంటూనే ఎమ్మెల్సీ టికెట్లు రెడ్లకు ఇచ్చారని ఆగ్రహ ం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌కు చిత్తశుద్ధి ఉంటే బీసీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించాలని డి మాండ్ చేశారు. రాష్ట్ర నాయకుడు విక్రం గౌడ్, జిల్లా అధ్యక్షుడు బ్రహ్మాండభేరి నరేశ్, నాయకులు రాజేందర్, మల్లేశంగౌడ్, నాగరాజు తదితరులున్నారు.
బీసీల గెలుపును ఎవరూ ఆపలేరు
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్
Comments
Please login to add a commentAdd a comment