మహాకుంభమేళాకు వెళ్లి.. అస్వస్థతకు గురై
మల్లాపూర్(కోరుట్ల): ఉత్తరప్రదేశ్‌లోని ప్రయోగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్లిన ఓ యువకుడు అస్వస్థతకు గురై, మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కొత్తదాంరాజుపల్లికి చెందిన బద్దం శంకర్–ఇందిర దంపతులకు ఒక కుమారుడు చంద్రశేఖర్‌రెడ్డి(29), కూతురు ఉన్నారు. చంద్రశేఖర్‌రెడ్డి, మరో 11 మంది ఈ నెల 17న మహాకుంభమేళాకు వెళ్లారు. అక్కడి నుంచి 20న కాశీ చేరుకున్నాక అతనికి బీపీ ఎక్కువై, తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంట ఉన్నవారు అక్కడే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి, బాధిత కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కుటుంబీకులు వెంటనే అక్కడికి వెళ్లి, చంద్రశేఖర్‌రెడ్డిని మెరుగైన వైద్యం కోసం ఆదివారం హైదరాబాద్‌కు తీసుకువస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతదేహాన్ని అర్ధరాత్రి స్వగ్రామం తీసుకువచ్చారు. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వారిని కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు పరామర్శించి, ఓదార్చారు.
హైదరాబాద్ తీసుకువస్తుండగా యువకుడి మృతి
కొత్తదాంరాజుపల్లిలో విషాదం
Comments
Please login to add a commentAdd a comment