ఉత్సాహంగా వ్యవసాయ వర్సిటీ క్రీడలు
జగిత్యాల అగ్రికల్చర్: జగిత్యాల రూరల్ మండలంలోని పొలాస వ్యవసాయ కళాశాలలో అంతర్రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ నాన్ టీచింగ్ సిబ్బంది క్రీడలు రెండో రోజు సోమవారం ఉత్సాహంగా సాగాయి. షార్ట్‌పుట్, జావెలిన్ త్రో, డిస్కస్ త్రో పోటీల్లో పలు జట్లు పోటీ పడ్డాయి. షటిల్ బ్యాడ్మింటన్, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, చెస్, త్రోబాల్, టెన్నికాయిట్, రన్నింగ్ పోటీల్లో కొన్ని జట్లు సెమీఫైనల్ చేరాయి. వాలీబాల్ విన్నర్‌గా సెంట్రల్ తెలంగాణ జోన్, బాల్ బ్యాడ్మింటన్ విన్నర్‌గా రాజేంద్రనగర్ జోన్, టేబుల్ టెన్నిస్ విన్నర్‌గా రాజేంద్రనగర్ జోన్, చెస్ విన్నర్‌గా సెంట్రల్ తెలంగాణ జోన్, క్యారమ్స్ విన్నర్‌గా సెంట్రల్ తెలంగాణ జోన్ జట్లు నిలిచాయి. అలాగే, సాయంత్రం జరిగిన సాంస్కృతిక పోటీల్లో ఆయా జోన్లకు సంబంధించిన వారు తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. వర్సిటీ స్పోర్ట్స్ డైరెక్టర్ డాక్టర్ సురేశ్, వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ భారతీ నారాయణ్ భట్, పరిశోధన స్థానం డైరెక్టర్ శ్రీలత పర్యవేక్షించారు.
సిబ్బందిలో ఉత్సాహం నింపేందుకు..
సిబ్బందిలో ఉత్సాహం నింపడంతోపాటు వారిలో దాగివు న్న నైపుణ్యాన్ని బయటకు తెచ్చేందుకే రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నాం. ఒక జోన్‌కు చెందిన సిబ్బంది మరో జోన్‌కు వెళ్లడం వల్ల వారిలో స్నేహభావం పెంపొందుతుంది. – డాక్టర్ సురేశ్,
వ్యవసాయ వర్సిటీ క్రీడల డైరెక్టర్, హైదరాబాద్
ఉత్సాహంగా వ్యవసాయ వర్సిటీ క్రీడలు
Comments
Please login to add a commentAdd a comment