
కండుపులోంచి రెండు కిలోల కంతీ తొలగింపు
కోల్‌సిటీ(రామగుండం): తీవ్రమైన కడుపునొప్పి, రక్తస్రావంతో తల్లడిల్లుతూ ప్రభుత్వాస్పత్రికి వచ్చిన ఓ మ హిళకు గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యబృందం మెరుగైన శస్త్రచికిత్సలు చేసి శభాష్ అనిపించుకున్నారు. ఆపరేషన్ చేయడం రిస్క్ అని తెలిసీ కూడా గురువారం ఆ మహిళకు ఆపరేషన్ చేసి ప్రాణం పోశారు. గైనిక్ విభాగం ప్రొఫెసర్ శ్రీదేవి తెలిపిన వివరాల ప్రకారం.. 10 రోజుల క్రితం పాలకుర్తి మండలం ఎల్కపల్లికి చెందిన హేమలత కడుపునొప్పి, రక్తస్రావంతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చింది. అడ్మింట్ చేసుకొని పరీక్షించిన వైద్యులు గర్భసంచిలో కంతీ ఉన్నట్లు గుర్తించారు. ఆమెకు అప్పటికే రెండు పెద్దాపరేషన్లు కూడా జరిగాయి. ఇలాంటి రిస్క్ కండీషన్‌లో పేషెంట్‌కు ఆపరేషన్ చేయడం సవాల్‌గా మారింది. యూరాలజిస్టు నిషాంత్, సర్జన్ దామెర అనిల్‌కుమార్ తొలత అవసరమైన అన్ని వైద్య పరీక్షలు, ప్రొసిజర్లు పూర్తి చేసిన అనంతరం పేషెంట్‌కు గురువారం గైనిక్ హెచ్‌ఓడీ అరుణ ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీదేవి, అనస్తీషియా నిపుణులు ప్రశాంత్‌తోపాటు మిగితా వైద్య బృందం జ్యోతి, శ్రవంతి సక్సెస్‌గా ఆపరేషన్ నిర్వహించారు. ఆమె కడుపులోంచి రెండు కిలోల బరువు ఉన్న కంతీని తొలగించారు. ఆపరేషన్ చేసిన వైద్య బృందాన్ని సిమ్స్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ హిమబింద్‌సింగ్ అభినందించారు.
జీజీహెచ్‌లో మెరుగైన శస్త్ర చికిత్స