రాజీపడితేనే సమస్యల పరిష్కారం
జనగామ రూరల్: పంతాలకు పోకుండా కక్షిదారులు రాజీపడితేనే సమస్యలు పరిష్కారం అవుతా యని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి.రవీంద్రశర్మ అన్నారు. శనివారం జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇరు పక్షాలు రాజీపడే కేసులు ఒప్పందం చేసుకుంటే ఉపయోగకరమని, కాలంతోపాటు డబ్బు వృథా కాదని చెప్పారు. జాతీయ లోక్ అదా లత్‌లో తెలంగాణ రాష్ట్రం ఎక్కువ కేసులు పరిష్కరించి దేశంలో ప్రథమ స్థానంలో ఉందని, ఈసారి కూడా అదే స్థానంలో నిలిచేలా కక్షిదారులకు ఉపయోగపడేలా జిల్లా స్థాయిలో కమ్యూనిటీ మీడియేటర్లను నియమిస్తున్నామని చెప్పారు. కుటుంబ తగాదాలు, సివిల్ కేసులను తగ్గించడానికి, కేసులు కోర్టుకు రాకుండా మధ్యవర్తుల ద్వారానే పరిష్కరించుకోవాలని సూచించారు. ఆరు బెంచ్‌ల ద్వారా 5,461 కేసులు పరిష్కారంకాగా, రూ.1,03,80,378 వసూలు చేసినట్లు తెలిపారు. ఇందులో సివిల్ కేసులు 135, మోటార్ యాక్సిడెంట్ 14, క్రిమినల్ 4,959, ప్రీలిటిగేషన్ కేసులు 353 ఉన్నాయి. లోక్ అదాలత్‌లో న్యాయమూర్తులు రవీంద్రశర్మతో పా టు సి.విక్రమ్, ఇ.సుచరిత, కుమారి జి.శశి, కుమారి కె.సందీప, డి.వెంకట్రాంనర్సయ్య, అడ్వకేట్లు కె.చంద్రశేఖర్, సీహెచ్.కిరణ్‌కుమార్, ఎన్.సంధ్యారాణి, బి.స్వప్న, జి.రేఖ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్రశర్మ
జాతీయ లోక్ అదాలత్‌లో
5,461 కేసుల పరిష్కారం
Comments
Please login to add a commentAdd a comment