స్టేషన్‌ఘన్‌పూర్: ఈనెల 16న స్టేషన్ ఘన్‌పూర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనకు సంబందించి పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘన్‌పూర్‌కు జంట పట్టణమైన శివునిపల్లిలో వ్యవసాయ మార్కెట్‌కు సమీపాన ఉన్న సీఎం సభాస్థలిని కలెక్టర్ షేక్ రిజ్వాన్‌బాషా, అడిషనల్ కలెక్టర్లు, డీసీపీతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి బుధవారం పరిశీలించారు. ముందుగా హెలిపాడ్, సభాస్థలికి సంబంధించిన మ్యాప్‌ను పరిశీలించారు. అనంతరం హెలిపాడ్ స్థలాన్ని, సభ నిర్వహించే స్థలాన్ని స్వయంగా పరిశీలించారు. అనంతరం సభాస్థలి వద్ద కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు, డీసీపీ, వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. సభాస్థలి వద్ద ఇరువైపులా మెట్లు ఏర్పాటు చేయాలని, రేలింగ్‌లు, పోడియంలు ఏర్పాటు చేయాలన్నారు. సభాస్థలి, పార్కింగ్ స్థలం వద్ద తాగునీరు, టాయిలెట్స్ సౌకర్యాలు కల్పించాలని సూచించారు. వేసవికాలం ఎండను దృష్టిలో ఉంచుకుని జనాలకు నీడ కోసం షామియానాలు ఏర్పాటు చేయాలని, ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ఇతర మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సభాస్థలి సమీపంలో ప్రజలకు తాగునీరు, మజ్జిగ ఏర్పాటు చేయాలని సూచించారు. అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాల్లేకుండా చూడాలన్నారు. 15వ తేదీ మధ్యాహ్నం వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. పోలీసుశాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ సీఎం పర్యటనను, సభను విజయవంతం చేసేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రోహిత్‌సింగ్, పింకేశ్‌కుమార్, డీసీపీ రాజమహేంద్రనాయక్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ వేణుమాధవ్, ఏసీపీలు భీమ్‌శర్మ, నర్సయ్య, డీఆర్డీఏ వసంత, డీపీఓ స్వరూపరాణి, ఆర్డీఓలు వెంకన్న, గోపీరామ్, సీఐలు జి.వేణు, శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సుధీర్, జీసీడీఓ గౌసియా, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల ఎస్‌ఈలు, డీఈలు, అధికారులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి
సభాస్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్