సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
జనగామ: స్టేషన్‌ఘన్‌పూర్‌లో సీఎం పర్యటన నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, రోహిత్ సింగ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్‌లతో కలిసి కలెక్టర్ గురువారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 16న సీఎం రేవంత్‌రెడ్డి రాక సందర్భంగా, ఆ యా శాఖల అధికారులకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రితో పాటు వీవీఐపీలకు అన్ని వసతులను సమకూర్చాలని సూచించారు. బహిరంగ సభ కు హాజరయ్యే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి కంపాట్మెంట్‌లో ఇద్ద రు ఏఎన్‌ఎంల పర్యవేక్షణ ఉండాలన్నారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమాన్ నాయక్, ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, జెడ్పీ సీఈఓ మాధురీ కిరణ్ చంద్ర షా, డిప్యూటీ జెడ్పీ సీఈఓ సరిత, డీపీఓ స్వరూప, డీఆర్డీఏ వసంత పాల్గొన్నారు.
సమావేశాలు పూర్తి చేయాలి
జనగామ రూరల్: మార్చి 19లోపు ఓటరు జాబితా సవరణ, ఇతర అంశాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఆదేశించా రు. హైదరాబాద్ నుంచి ఆయన గురువారం ఎన్ని కల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీ క్షించారు. జిల్లాలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బా షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సవరణ జిల్లాలో ప్రతి 3 నెలలకోసారి పకడ్బందీగా నిర్వహించాల న్నారు. ఓటరు జాబితా సవరణ, పోటీ చేసిన అభ్యర్థుల వివరాల సమర్పణ, బూత్ స్థాయి ఏజెంట్ల నియామకం, తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధి కారులు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి, మార్చి 27 లోపు ఎన్నికల కమిషన్‌కు వివరాలు సమర్పించాలన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రెవెన్యూ డివిజన్ అధికారులు, తహసీల్దార్‌తో సమావేశాలు నిర్వహించాలన్నారు. నూతన ఓటర్ల నమోదు, ఓటు బదిలీ, మరణించిన వారి ఓటర్ల వివరాల తొలగింపు వివరాలు క్షుణ్ణంగా నమోదు చేయాలని తెలిపారు. ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
కృత్రిమ మేథతో సామర్థ్యాల మెరుగు
ఈనెల 15వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో కృత్రిమ మేథ ద్వారా బోధన ప్రారంభించి, విద్యార్థు ల సామర్థ్యాలను మెరుగుపర్చనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా తెలిపారు. హైదరా బాద్ నుంచి రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి, కమిషనర్ ఈవీ నర్సింహారెడ్డి గురువారం విద్యాశాఖ బలోపే తం, నూతన విద్యా విధానంపై కలెక్టర్, విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ కార్యదర్శి మాట్లాడు తూ.. ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో సమగ్ర శిక్షా తెలంగాణ విద్యాశాఖ మౌలిక భాషా గణిత సామర్థ్యాల సాధన కార్యక్రమంలో భాగంగా కృత్రిమ మేథను ఉపయోగించి బోధనను మెరుగుపరిచేందుకు ఏ ఎక్స్‌ఎల్ ఏక్ స్టెప్ ఫౌండేషన్ సహకారంతో మొదటి దశలో పైలట్ ప్రాజెక్టుగా (6) జిల్లాల్లో ప్రారంభించినట్లు తెలిపారు. మెరుగైన ఫలితాలు సాధించడంతో జిల్లా నుంచి నలుగురికి రాష్ట్రస్థాయిలో శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ.. కృత్రిమ మేథతో ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల విద్యార్థుల్లో మెరుగైన అభ్యసన సామర్థ్యాలను సాధించడం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో మొత్తం 17 పాఠశాలలు ఎంపికయ్యాయని వెల్లడించారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
సమీక్షలో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా