● ఎమ్మెల్యే కడియం శ్రీహరి
● సభాస్థలి వద్ద ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్
స్టేషన్‌ఘన్‌పూర్: ఈనెల 16న స్టేషన్‌ఘన్‌పూర్‌లో నిర్వహించనున్న సీఎం సభకు సంబంఽధించిన ఏర్పాట్లను పకడ్బందీగా చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలో శివునిపల్లిలో వ్యవసాయ మార్కెట్ సమీపాన నిర్వహించనున్న సీఎం రేవంత్‌రెడ్డి సభకు సంబంధించిన సభాస్థలాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ రిజ్వాన్ బాషా శుక్రవారం పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడుతూ పార్కింగ్ స్థలాలు, తాగునీటి సౌకర్యం తదితర అంశాలపై చర్చించారు. ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, సరిపడా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ఇతర మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సీఎం సభను జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రోహిత్‌సింగ్, పింకేష్‌కుమార్, డీసీపీ రాజమహేంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాపై సీఎంకు ప్రత్యేక అభిమానం
● డీసీసీ అధ్యక్షుడు
కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి
జనగామ: జిల్లా అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డికి ప్రత్యేక అ భిమానం ఉందని డీసీపీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడు తూ ఈ నెల 16న స్టేషన్‌ఘన్‌పూర్‌లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమా ల కోసం సీఎం రానున్నట్లు తెలిపారు. దోపిడీకి గు రైన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం మొక్కవోని దీక్షతో పని చేస్తున్నారన్నారు. అ భివృద్ధిలో వెనకబడి ఉన్న ప్రాంతాలపై సీఎం ఫోకస్ సారిస్తున్నారన్నారు. గత ప్రభుత్వం నియోజకవర్గాల్లో కనీస మౌలిక వసతులు కల్పించ లేకపోయిందన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి నాయకత్వంలో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధికి బాటలు వేసుకుంటుందన్నారు. సీఎం పర్యటన నేపధ్యంలో అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదించి, ప్రజాపాలనకు మద్దతు పలకాలన్నారు.
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు