హైదరాబాద్‌తో | - | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌తో

Published Mon, Mar 17 2025 11:14 AM | Last Updated on Mon, Mar 17 2025 11:09 AM

హైదరా

హైదరాబాద్‌తో

సోమవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2025

8లోu

సభలో అభివాదం చేస్తున్న

సీఎం

రేవంత్‌రెడ్డి

బహిరంగ సభకు హాజరైన ప్రజలు, రిమోట్‌ ద్వారా అభివృద్ధి

పనులకు శంకుస్థాపన చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, చిత్రంలో

మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, సురేఖ,

ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య, ప్రజాప్రతినిధులు

సాక్షి ప్రతినిధి, వరంగల్‌/జనగామ/స్టేషన్‌ఘన్‌పూర్‌: జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ శివారు శివునిపల్లిలో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి ఓరుగల్లుపై వరాల జల్లు కురిపించారు. మరోవైపు బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌, ఆయన కుటుంబసభ్యులపై విమర్శలు గుప్పించారు. శివునిపల్లిలో ఈ కార్యక్రమం రాజకీయ పార్టీగా ఏర్పాటు చేసింది కాదని, ఓట్ల కోసం రాలేదన్న ఆయన.. స్టేషన్‌ఘన్‌పూర్‌ అభివృద్ధిలో భాగంగా రూ.800 కోట్ల నిధులతో ప్రగతి కోసం తలపెట్టిన బహిరంగ సభ అని స్పష్టం చేశారు. వరంగల్‌ నగరాన్ని హైదరాబాద్‌తో పోటీ పడేలా అభివృద్ధి చేస్తామని, ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ ఇందుకోసం ఎన్ని నిధులైనా కేటాయిస్తామని ప్రకటించారు. మరోవైపు వరంగల్‌ అంటే తనకు ప్రత్యేక అభిమానమన్న ముఖ్యమంత్రి.. ఉమ్మడి జిల్లాను విద్య, వైద్యం, పర్యాటక, ఐటీ హబ్‌లుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందన్నారు. సీఎం సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్‌ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.

కడియం శ్రీహరిని నేనే రమ్మన్నా..

ఈ ప్రభుత్వం వచ్చాకే వరంగల్‌కు ఎయిర్‌పోర్టు, కాజీపేటకు రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ, వరంగల్‌కు రింగ్‌రోడ్డు వచ్చాయని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ఎంపీ కడియం కావ్య ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగా జీఎంఆర్‌ నుంచి క్లియరెన్స్‌ తీసుకుని కేంద్ర మంత్రులను కలిసి ఎయిర్‌పోర్టు సాధించామని తెలిపారు. అలాగే, రైల్వే కోచ్‌ఫ్యాక్టరీని సాధించామని, కాజీపేట రైల్వే డివిజన్‌ చేయడం కోసం ఎంపీ కావ్యతోపాటు తన కృషి ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. వరంగల్‌ నగరంలో అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ, ఔటర్‌ రింగ్‌రోడ్డు, ఇన్నర్‌ రింగ్‌రోడ్డుతోపాటు పలు అభివృద్ధి పథకాల కోసం రూ.6,500 కోట్లు మంజూరు చేశామని, త్వరలోనే ఆ పనులు మొదలవుతాయన్నారు. జయశంకర్‌ సర్‌ స్వగ్రామం అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా చేసింది ఈ ప్రభుత్వమేనన్న ఆయన.. మహిళలకు వెయ్యి బస్సులు ఇచ్చి ఆర్టీసీలో అద్దెకు తీసుకున్నామని చెప్పారు. మహిళల చేత వెయ్యి మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయించడం ద్వారా ఉమ్మడి వరంగల్‌కు చెందిన మహిళలకు మేలు జరిగిందని తెలిపారు. అభివృద్ధిలో భాగంగా ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌, వంద పడకల ఆస్పత్రి, ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు వంటి శాశ్వత ప్రాతిపదికన స్టేషన్‌ఘన్‌పూర్‌ అభివృద్ధికి రూ.800 కోట్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక కడియం శ్రీహరి సేవలు గుర్తెరిగి ఆయన నిజాయితీ, అనుభవం కావాలని, తానే అక్కున చేర్చుకొని పార్టీలో చేరాలని కోరినట్లు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మా కోరిక మేరకు ఆయన పార్టీలో చేరగా.. చెల్లెలు డాక్టర్‌ కావ్యను ఎంపీగా గెలిపించారన్నారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తికావాలంటే శ్రీహరి నాయకత్వాన్ని బలపర్చాలని ప్రజలను కోరారు.

కేసీఆర్‌, ఆయన కుటుంబంపై ఘాటైన విమర్శలు..

జనగామ జిల్లా శివునిపల్లి వేదికగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన కుటుంబంపై సీఎం రేవంత్‌రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. మాజీ మంత్రులు కేటీఆర్‌, టి.హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపైన ఆయన కామెంట్స్‌ చేశారు. ‘అధికారం ఉంటే తప్ప కేసీఆర్‌ ప్రజల్లోకి రాలేరా? ఆయన బయటకు రాకుండా కొడుకు, అల్లుడిని ఊరు మీదకు వదులుతున్నారు. బయటకు రానప్పుడు ఆయనకు ప్రతిపక్ష హోదా ఎందుకు? జీతభత్యాలు ఎందుకు?.. ఇలా చేస్తేనే కదా కాంగ్రెస్‌ దెబ్బ ఎలా ఉంటుందో 2023లో ప్రజలు చూపించారు’ అంటూ విమర్శలు చేశారు. ‘క్యాప్సికం పండిస్తే రూ.కోట్లు వస్తాయన్న కేసీఆర్‌.. ఆ టెక్నిక్‌ ఏంటో ప్రజలకు చెప్పండి.. నీ లక్ష కోట్ల సంపాదన నైపుణ్యం ఏంటో ప్రజలకు చెప్పండి.. వెయ్యి మంది యువకులను నీ ఫామ్‌ హౌస్‌కు పంపిస్తాం. ఆ టెక్నిక్‌ ఏంటో వారికి నేర్పించండి’ అంటూ ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్ము దోచుకుని పేపర్‌, టీవీ చానళ్లు పెట్టుకున్న వ్యక్తి జాతిపిత ఎలా అవుతారని ప్రశ్నించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఆయనతోపాటు కేటీఆర్‌, హరీశ్‌రావు, కవితకు ఫామ్‌హౌస్‌లు ఎక్కడినుంచి వచ్చాయని ప్రశ్నించారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ధనసరి సీతక్క, కొండా సురేఖ, ఎంపీలు కడియం కావ్య, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, పోరిక బలరాంనాయక్‌, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్‌.నాగరాజు, యశస్వినిరెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, తెలంగాణ ఆయిల్‌ సీడ్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ జంగా రాఘవరెడ్డి, వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌, కలెక్టర్‌ షేక్‌ రిజ్వాన్‌బాషా, అదనపు కలెక్టర్లు పింకేష్‌కుమార్‌, రోహిత్‌సింగ్‌, నాయకులు ఝాన్సీరెడ్డి, ఏఎంసీ చైర్‌పర్సన్‌ జూలుకుంట్ల లావణ్య పాల్గొన్నారు.

న్యూస్‌రీల్‌

పక్కాగా సంక్షేమ పథకాల అమలు

మామునూరు ఎయిర్‌ పోర్ట్‌,

రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ కాంగ్రెస్‌ ఘనతే..

ప్రతిష్టాత్మకంగా విమానాశ్రయాన్ని

నిర్మిస్తామని స్పష్టీకరణ

విద్య, వైద్యం, పర్యాటక, ఐటీ

హబ్‌గా ఓరుగల్లుకు ప్రాధాన్యం..

ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభ విజయవంతం

హైదరాబాద్‌తో 1
1/3

హైదరాబాద్‌తో

హైదరాబాద్‌తో 2
2/3

హైదరాబాద్‌తో

హైదరాబాద్‌తో 3
3/3

హైదరాబాద్‌తో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement