ఓటరుగా నమోదు చేసుకోవాలి
స్టేషన్‌ఘన్‌పూర్: అర్హులైన ప్రతీఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఈ దిశగా గ్రామాల్లో వివిధ రాజకీయ పార్టీల నాయకులు యువతను చైతన్యం చేయాలని ఆర్డీఓ డీఎస్ వెంకన్న అన్నారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం అఖిల పక్ష పార్టీల నాయకులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ నిరంతర ప్రక్రియగా ఉంటుందన్నారు. ఓటర్ల జాబితాలో ఏమైనా సవరణలు ఉంటే బీఎల్‌ఓలను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, నాయబ్ తహసీల్దార్ సదానందం, ఆర్‌ఐలు శ్రీకాంత్, సతీష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.