గేటు మూస్తే రాకపోకలు కష్టమే..
రఘునాథపల్లి మండలం నిడిగొండ–ఫతేషాపూర్ మధ్యలో రైల్వేగేటు ఉంది. రాకపోకలకు ఇబ్బంది కలుగకుండా అండర్ బ్రిడ్జి(ఆర్‌యూబీ) నిర్మిస్తున్నారు. ఆర్‌యూబీ నిర్మాణ దశలో ఉండగానే గేటు మూసి వేస్తామనడంతో ప్రయాణానికి ఇబ్బంది అవుతుందని ఆందోళన చెందిన గొట్టం కరుణాకర్‌రెడ్డి, గాజులపాటి మహేందర్, హయత్‌అలీ, మొహన్, నాగరాజు, షబ్బీర్ మియా, గాజులపాటి నేతాజీ, హింగె మోహన్, వీరోజు, సత్యనారాయణ, మనోహర్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గేటు మూసి వేస్తే 8 గ్రామాల ప్రజలు అదనంగా 15 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి ఉంటుంద ని పేర్కొన్నారు. ఆర్‌యూబీ పూర్తయ్యే వరకు గేటు తెరిచి ఉంచాలని విజ్ఞప్తి చేశారు.
●