పక్క ఫొటోలోని వ్యక్తులు రఘునాథపల్లి మండలం కంచెనపల్లికి చెందిన అమృతం, దేవరుప్పుల మండలం కడవెండికి చెందిన నల్ల మధు, గుమ్మడవెల్లి భిక్షపతి. జిల్లా కేంద్రం హైదరాబాద్‌రోడ్డున 1990 ప్రాంతంలో 70 మంది ప్లాట్లు కొనుగోలు చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అధికారులు సమాచారం లేకుండా ప్లాట్లలో కాల్వ పనులు చేస్తుండగా తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు. నోటీసులు ఇవ్వకుండా పనులు ఎలా చేస్తారని అడగ్గా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో న్యాయం చేయాలని కలెక్టర్‌కు అర్జీ పెట్టుకున్నట్లు బాధితులు తెలిపారు.