వినియోగించుకోవాలి
పునరుత్పాదక వనరులను
జనగామ రూరల్: పునరుత్పాదక వనరులను విని యోగించుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నా రు. గురువారం ఓబుల్‌కేశ్వాపూర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో యూత్ ఆఫ్ ఇండియా ఎన్జీవోస్ సంస్థ ఆధ్వర్యాన మైక్రోగ్రిడ్ సౌర ప్రాజెక్టును ప్రారంభించిన అనంత రం ఆయన మాట్లాడారు. యూత్ ఆఫ్ ఇండియా ఎన్జీఓస్ సంస్థ సహకారంతో సేల్స్ ఫోర్స్ సాఫ్ట్ వేర్ కంపెనీ చేయూతతో రూ.1.6కోట్ల వ్యయంతో గ్రామంలో 100 ఇళ్లకు సౌర ప్యానళ్లు, 100 సౌర వీధి దీపాలు, పాఠశాలలో పది సౌర ప్యానళ్లు అమర్చినట్లు చెప్పారు. మరిన్ని గ్రామాలను దత్తత తీసుకుని ఈ ప్రాజెక్టును కొనసాగించాలని కోరారు. అలాగే ‘పీఎం సూర్య ఘర్’ పథకం కింద గృహాల కు కనెక్షన్ తీసుకోవచ్చని, బ్యాంకు రుణ సదుపా యం, రాయితీ లభిస్తుందన్నారు. గ్రామాలు, స్కూళ్లు, పాఠశాలలు, పొలాల వద్ద కూడా ఈ సౌర ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవచ్చని, ఈ పీఎం సూర్య ఘర్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించా రు. ఈ సందర్భంగా 9వ తరగతి విద్యార్థులు రూపొందించిన సౌర శక్తి ప్రాజెక్టు నమూనాను కలెక్టర్ పరిశీలించి అభినందించారు. డీఈఓ రమేశ్, పాఠశాల హెచ్‌ఎం వీరాంజని, ఆయా సంస్థల సభ్యులు శైలేష్, సాయి, రాజు, చంద్రశేఖర్, సంకే త్, కిరణ్, కోమ్మురాజు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా