గణపురం: విద్యార్థుల పరీక్షలు ముగిసే వరకు అన్ని శాఖల అఽధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్‌శర్మ కోరారు. బుధవారం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యుత్, తాగునీరు, వైద్యసేవలను పరిశీలించి, పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరీక్షల నిర్వాహన పకడ్బందీగా నిర్వహించాలన్నారు. పరీక్ష కేంద్రం వద్ద బందోబస్తు నిర్వహించాలని, విద్యార్థుల వెంట ఎలక్ట్రానిక్ పరికరాలను ఉండకుండా, మాస్ కాపీయింగ్‌కు తావు లేకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. అలాగే ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాల తరలింపులో జాగ్రత్తగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సత్యనారాయణస్వామి, సీఎస్, తదితరులు ఉన్నారు.
ఏడుగురి గైర్హాజరు
భూపాలపల్లి రూరల్: జిల్లాలో నిర్వహిస్తున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలు కొనసాగుతున్నట్లు డీఈఓ రాజేందర్ తెలిపారు. బుధవారం నిర్వహించిన పరీక్షలో 3,449 మందికి గాను 3,442 మంది విద్యార్థులు హాజరై ఏడుగురు విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. జిల్లాలోని పలు పరీక్ష కేంద్రాలను అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, పరీక్షల నియంత్రణ అధికారి మందల రవీందర్‌రెడ్డి, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేసినట్లు తెలిపారు.
కలెక్టర్ రాహుల్‌శర్మ