
ఒకే వేదికపై ముగ్గురు..
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రం బాంబులగడ్డ సమీపంలోని ఈద్గాలో సోమవారం జరిగిన రంజాన్ వేడుకలకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. ముస్లింలతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆసక్తిగా గమనించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి కరచాలనం చేసుకొని పలకరించుకున్నారు. చివరికి వచ్చిన గండ్ర వెంకటరమణరెడ్డి ఎవరినీ పలకరించకుండా నేరుగా నమాజ్ వద్దకు వెళ్లారు. ముగ్గురు నాయకులు సుమారు అరగంటకు పైగా పక్కపక్కన కూర్చుని ప్రార్థనల్లో పాల్గొని ప్రసంగించారు.
గ్రూప్–1 ర్యాంకర్‌కు
ఏఎస్పీ సన్మానం
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని మానసపల్లికి చెందిన దైనంపల్లి ప్రవీణ్‌కుమార్ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్–1 ఫలితాల్లో 105వ ర్యాంకు సాధించాడు. ఈ విషయం తెలుసుకున్న ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తన కార్యాలయంలో సోమవారం ప్రవీణ్‌ను ఘనంగా సన్మానించారు. ఉన్నత పదవుల్లో చేరి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రవీణ్ చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినా.. కష్టపడి చదివి మంచి ర్యాంకు సాధించారు. చదువుకు పేదరికం అడ్డు కాదని పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని ప్రవీణ్‌కుమార్ నిరూపించాడని గ్రామస్తులు, ప్రజలు అభినందించారు.
భద్రకాళి అమ్మవారికి
పుష్పార్చన
హన్మకొండ కల్చరల్: వసంత నవరాత్ర ఉత్సవాల్లో భద్రకాళి దేవాలయంలో సోమవారం అమ్మవారికి పుష్పార్చన చేశారు. ఉదయం అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అమ్మవారికి నిర్మాల్యసేవలు, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం వేదపండితులు, వేదపాఠశాల విద్యార్థులు తెల్లచామంతి పూలకు సంప్రోక్షణ చేసి అమ్మవారికి లక్షపుష్పార్చన నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయశాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె.దుర్గాప్రసాద్, డీఈ ఈ సీహెచ్ రమేశ్‌బాబు, ఏఈ వీరచందర్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈఓ శేషుభారతి, దేవాలయ సిబ్బంది పర్యవేక్షించారు.
వేయిస్తంభాల దేవాలయంలో సీతారాములకు పూజలు
హన్మకొండ కల్చరల్: శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో సోమవారం రెండోరోజూ సీతారాములకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో శ్రీరుద్రేశ్వరుడికి రుద్రాభిషేకం, 121 మంది దంపతులు సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించారు. తెలుగు సంవత్సరాది ప్రారంభం, శివ ప్రీతికరమైన సోమవారం కావడంతో అధికసంఖ్యలో భక్తులు దేవాలయాన్ని సందర్శించారు. కృష్ణయజుర్వేద పండితుడు గుదిమెల్ల విజయకుమారాచార్యులు ఆధ్వర్యంలో సీతారాముల ఉత్సవ మూర్తులను ప్రతిష్ఠించి అనుష్టాన పూజలు, యాగశాలలో మహా సుదర్శనహోమం జరిపారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ అనిల్‌కుమార్, సిబ్బంది పర్యవేక్షించారు.

ఒకే వేదికపై ముగ్గురు..

ఒకే వేదికపై ముగ్గురు..

ఒకే వేదికపై ముగ్గురు..