
చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
కాటారం: అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుతున్న ఆరేళ్లలోపు చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ తెలిపారు. జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో చేపడుతున్న కార్యక్రమాన్ని సోమవారం డీఎంహెచ్‌ఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ చిన్నతనంలోనే ఆరోగ్య, మానసిక సమస్యలను గుర్తించేందుకు జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఆరేళ్ల లోపు చిన్నారుల్లో ఎక్కువ శాతం నేత్ర సమస్యలు, మానసిక సమస్యలు వస్తున్న నేపథ్యంలో ఈ పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రమోద్, ఆర్‌బీఎస్‌కే డాక్టర్ బండి శ్రీనివాస్, డాక్టర్ సుజాత, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ మధుసూదన్