
మెట్లమార్గంలో రక్షణేది!
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం రాజగోపురం ఎదుట ఎండ తీవ్రతతో గ్రైనేట్ వేడెక్కి కాళ్లకు రక్షణ లేక భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎండ తీవ్రతతో ఆదివారం మెట్ల మార్గం గుండా కాలినడకన వచ్చి భక్తులు ఆలయంలో దర్శనం చేసుకొని తిరిగి బయటకు వచ్చేటప్పుడు కాళ్లు కాలిపోతుంటే భక్తులు పరుగులు తీశారు. దేవస్థానం అధికారులు కనీసం మ్యాట్‌లు, ఇతర సౌకర్యాలు కల్పించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో మెట్ల మార్గం గుండా విద్యుత్ వెలుగులు లేకపోవడంతో భక్తులు మెట్లు ఎక్కుతూ జారిపడుతున్నారు. రాజగోపురం చుట్టుపక్కల కూడా లైట్లు ఉన్నా విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నారు. రాత్రి వేళల్లో విద్యుత్ వెలుగులు, ఎండ తీవ్రత తట్టుకుని నడిచి వెళ్లేలా మ్యాట్‌లు ఏర్పాటు చేయాలని పలువురు భక్తులు కోరుతున్నారు. భక్తులకు కావాల్సిన ఏర్పాట్లపై దృష్టిసారించాలని కోరుతున్నారు.

మెట్లమార్గంలో రక్షణేది!